పల్లెపాటలు
103
రఘుమహారాజు ఉత్సవ సంకేతులను గణములను జయించిన తర్వాత కిన్నరులను ఒక దేశమువారు అతని జయోదాహరణమును పాటలుగా గానము చేసిరి. ఉదాహరణమనగా ఒక విధముగ ప్రబంధము. మన తందాన కథ వంటిది.
సంస్కృతములో దేశీగానము, మార్గవిధానగానము అను గానపద్ధతులుండెను. శ్రీరాముని చరిత్రమును వాల్మీకిbమార్గవిధానముగా రచించి కుశలవులచే గానము చేయించెను.
శ్లో॥ తతస్తుతౌ
రామవచ ప్రచోదితౌ
ఆగాయతాం
మార్గ విధాన సంపదా వాల్మీకి రామాయణము - బాలకాండ
సంస్కృతములో కన్న తెలుగులో బహు విధాల పల్లె పాటలుండెను. నన్నయభట్టు భారత రచనతో ఆ పాటలు క్రమక్రమముగా అనాదృతములయ్యెను. తుదకు ద్విపద కావ్యము రచించుట ఉత్తమ కవిత కాదను భావము ముదిరిపోయెను. అందుచేత పాల్కురికి సోమనాథుడు దాని విశిష్టతను తెలుపుటకై ప్రత్యేక శ్రద్ధను చూపవలసి
వచ్చెను. తన కాలములోను అంతకు ముందు తెనుగు దేశములో ప్రచారమందుండిన పాటలను కొన్నింటిని పాల్కురికి పండితారాధ్య చరిత్రలో వ్రాసి వుంచినందున మనకు వాటి పేరులైనా తెలియవచ్చుటకు వీలు కలిగినది. తుమ్మెద పదాలు, ప్రభాత
పదాలు, పర్వత పదాలు, ఆనంద పదాలు, శంకర పదాలు, నివాళి పదాలు, గొబ్బి పదాలు, వెన్నెల పదాలు ఇట్టి వింకా చాలా పదాల జనులు “పాడుచు ఆడుచుండిరి” అని అతడు తెలిపినాడు.
ఇప్పటికిని తెనుగు దేశంలోని స్త్రీలలో అనేక పాటలు నిలిచిపోయినవి. ఇప్పటికిని కొన్ని యిండ్లలో పెండ్లిండ్ల కాలములో సువ్వాలలు, ధవళాలు పాడుదురు. కలుపు తీయునప్పుడు, కల్లము చేయునప్పుడు రాటము త్రిప్పునపుడు, మోటకొట్టు నప్పుడు, విసురునప్పుడు దంచునప్పుడు, చాలామంది పాటలు పాడుచుందురు. పనితోపాటు పాటలుండును. అదుచేతనే కాబోలు “పనీ పాటా” అను సామెత మన భాషలో కలదు. స్త్రీల పాటలలో కామేశ్వరీ పాట కొన్ని బ్రాహ్మణ కుటుంబాలలో