Jump to content

పుట:సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలు.djvu/10

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అవతారిక

9

వ్యాసరచనలో ప్రతాపరెడ్డి గురుసిద్ధహస్తులు. ‘గోలకొండ పత్రిక’ సంపాదకులు గానే కాకుండా ఇతర పత్రికలలో, ప్రచురణలలో ఆయన రచించిన 150కి పైగా వ్యాసాలు వస్తువైవిధ్యం, ఆలోచనా నైశిత్యం, పరిశోధనాపాటవం, శైవీరామణీయక వంటి గుణ విశేషాలు సంతరించుకున్నాయి. వీటిలో నుండి 46 సాహిత్య, సాహిత్యేతర వ్యాసాలను నేను అధ్యక్షుడిగా వున్న 'సురవరం ప్రతాపరెడ్డి సాహిత్య వైజయంతి' సంస్థ లోగడ ఆచార్య ఎస్వీ రామారావు సంపాదకత్వాన రెండు భాగాలుగా ప్రచురించింది. జిజ్ఞాసువులైన పాఠకులకు, పరిశోధకులకు అత్యంత ఉపయుక్తంగా వుంటుందని పరిషత్తు ఈ వ్యాసాలను ఒక సంపుటిగా ప్రచురిస్తున్నది.

పరిషత్తు వెలువరిస్తున్న ఈ గ్రంథం ఎప్పటిలాగే అందరి మన్ననలను పొందగలదని విశ్వసిస్తున్నాను.


హైదరాబాదు

తేది: 15 మార్చి, 2015

(డా॥ సి. నారాయణరెడ్డి)