పుట:సీతారామాంజనేయ సంవాదము.pdf/8

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పీఠిక

v


రజతగిరియందు శంకరుఁడు పేరోలగముఁ దీర్చియుండుతఱిఁ దన పరిచర్యలయం దప్రమత్తురాలగు పార్వతినిఁ జూచి శంకరుఁడు సంతసించి నీయభీష్టంబుఁ దీర్తు నెద్దియేని వరము కోరుమనె నఁట. అందులకుఁ బార్వతి పవిత్రమగుమంత్రరాజ ముపదేశింపునుని కోర శంకరుఁడు నీకుఁ దగినది శ్రీరామమంత్రమని దాని నుపదేశించెనఁట. పిమ్మట పార్వతి శంక రునిఁజూచి శ్రీరామతత్త్వస్వరూప మెట్టిదని ప్రశ్నింప, శ్రీరాము నను మతిచే సీత హనుమంతున కెఱింగించినయంశము శంకరుఁడు పార్వతి కెఱింగించెనఁట, ఇదియే యీగ్రంథావతారిక.

కవికాలము తెలిసికొనుటకు గ్రంథమున నాధారములు లేవు. రతి మన్మథవిలాసము కవిస్తుతిలో అయ్యలరాజు రామభద్రుని పేర్కొని యుంటచే పదునాఱవశతాబ్దమునకుఁ గడపటివాఁ డనువిషయము స్థూలదృష్టికిఁ దోఁచును. కవికిఁ గడపటివంశవృక్ష మీక్రిందివిధముగ నున్నది.

ఈ వంశవృక్షమునందలి పట్టాభిరామయ్య గ్రంథకర్తయగు లింగ మూర్తికవి కైదవతరమువాఁడు. ఈపట్టాభిరామయ్యకు వయస్సు 40సం