పుట:సీతారామాంజనేయ సంవాదము.pdf/7

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పీఠిక


     ప్రభువుల కెల్ల సత్ప్రభు వైన బ్రహ్మకుఁ
          బ్రభు వౌచు నెవ్వఁడు పరఁగుచుండు

గీ. సగుణ నిర్గుణరూపుఁడై నెగడుచుండు
  నమ్మహాదేవగురువరు నభినుతింప
  సకలనిగమాగమాంతశాస్త్రంబు లోప
  వనఁగ మముబోంట్లకు నుతింప నలవి యగునె."

ఈపద్యమువలన మహాదేవయోగి దైవసముఁ డని తోచు చున్నది. ఎంతఁవాడొ కానిది లింగమూర్తికవికి గురువు కాఁగలడా! కవి తాను, మహాదేవయోగి గురుఁ డని యిట్లు చెప్పికొనెను.

గీ. “అమ్మహాదేవగురుచరణారవింద
    పరపరాగాంశభజనతత్పరుఁడఁ బరశు
    రామపంతులకులజాతరామమంత్రి
    మౌళితిమ్మాంబికాప్రియాత్మజుఁడ నేను. "

కొండొకచోట నిక్కవి తనదేశికుని సీతారామస్వామికి సమాను నిగ నీక్రిందిపద్యములోఁ జెప్పికొని యున్నాఁడు.

క."ప్రణవాత్మకసదసత్కా
   రణసంపూర్ణప్రభాభిరామసగుణని
   ర్గుణ నిర్వికారనారా
   యణసీతారామగురుమహాదేవశివా."

కవి తానీగ్రంథమున బ్రహ్మాండపురాణాంతర్గత మగు అధ్యాత్మ రామాయణమునందలి శ్రీరామహృదయమును విస్తరించి వ్రాసితినని యు శ్రీరాముఁడు స్వప్నమునఁ బ్రత్యక్షమై కృతి రచింపు మనె ననియు వ్రాసికొనియున్నాఁడు.

ఈకవి యీ గ్రంథమును మూఁడాశ్వాసములుగ విభజించి క్రమ ముగఁ దారకయోగము సాంఖ్యయోగము అమనస్కయోగము అని పేరులఁ బెట్టి యున్నాడు.