పుట:సీతారామాంజనేయ సంవాదము.pdf/6

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పీఠిక

iii

మంత్రోపదేశకుఁడై నిజామురాష్ట్రమున నఖిలదిశల బల్లకి నెక్కి తిరిగి పెక్కండ్రు శిష్యుల గడించి వారివలనఁ బొందెనఁట.

కవి తనగురుపరంపర నిటుఁల జెప్పికొన్నాఁడు.

ఇందు కడపటివాఁ డగుమహాదేవగురుఁడే ప్రకృతకవి కుపదేశ మొనరించిన దేశికుఁడు, ఈ దేశిక నామము రతీమన్మథవిలాసమునఁ గాన రామిచే నప్పటి కీకవి భక్తియోగాభ్యాస మొనరించి యుండఁ డని తెలియుచున్నది. సీతారామాంజనేయమునఁ దన దేశికు నిటుల స్తోత్ర మొనరించి యున్నాఁడు.

సీ. “అఖిలభూతంబుల నాడించుమాయను
             సొంపుగా నెవ్వఁ డాడింపుచుండు
     గురుజనంబుల కెల్ల గురువులై తగుహరి
             హరుల కెవ్వఁడు గురు వగుచునుండు
     విబుధలోకంబుల వెలిఁగించి వెలుఁగుల
             మించి యెవ్వఁడు వెలిగించుచుండు