పుట:సీతారామాంజనేయ సంవాదము.pdf/50

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పీఠిక

31


4. తత్వాధ్వము:- పృథివి ప్రకృతి బుద్ధి అహంకారమన శ్శోత్రత్వక్ చక్షుర్జిహ్వాఘ్రాణ వాక్ పాణి పాద పాయు గుహ్య శబ్ద స్పర్శ రూప రసగంధ ఆకాశ వాయువహ్ని జల మాయ కాల నియతి కాలా విద్యా రాగ పురుష, సదాశివ ఈశ్వర శుద్ధవిద్య శివశక్తు లనుతత్త్వములు ముప్పదియాఱు. లేక, భూతపంచక జ్ఞానేంద్రియపంచక కర్మేంద్రియపంచక ప్రాణపంచకశబ్దాది పంచకములును నాదిచతుష్టయమును శరీరత్రయమును అవస్థాత్రయమును అజ్ఞానమును, ఇవియే ముప్పదియాఱు తత్త్వములు. జ్ఞానేంద్రియ కర్మేంద్రియ ప్రాణశబ్దాది విషయపంచకములు మానసాది చతుష్టయమును గూడి యిరువదినాలుగుతత్త్వములు. పైఁ జెప్పిన ముప్పదియాఱుతత్త్వములును షడ్భావవికార షట్కౌౌశికషడూర్మి అరిషడ్వర్గములును, జీవత్రయ గుణత్రయ కర్మత్రయములును, వచనాదానగమనవిసర్గానందములును, సంకల్పాధ్యవసాయాభిమానావధారంబులు, వైచిత్య్రాదిచతుష్టయమును, దిగ్వాగార్కాది చతుర్దశేంద్రియాధిష్ఠానాదిదేవతలును, అనునవి యన్నియుఁ గూడి తొంబదియాఱు తత్త్వములు.

5. భువనాధ్వము:- భద్రకాళివీరభద్ర త్రిలోచననభ లిప్సువివాహసంవాహ త్రిదశేశ్వరత్య్రక్ష విభుశంభుదంష్ట్రవజ్రఫణీంద్ర, ఉదుంబరగ్రసన మారుతాసనక్రోధన అనంత వృషధర వృషబలిప్రియ భూతపాల జ్యేష్ఠ శర్వసురేశ్వర వేదపారగజ్ఞానభూసర్వజ్ఞ ఈశానవిద్యాధిప ప్రకామదప్రసాద శ్రీధర రత్నధర లక్ష్మీధర జటాధర సౌమ్యధర ధన్యరూప విధీశ మేఘవాహన కపర్దిపంచశిఖ పంచాంతకక్షయాంతక తీక్ష్ణ సూక్ష్మవాయువేగ లఘు శీఘ్రసునాదమేఘనాదజలాంతక దీర్ఘబాహు జయభద్ర, శ్వేత మహాబల పాశహస్త ఆతిబలబల దంష్ట్రలోహిత ధూమ్ర విరూపాక్ష ఊర్ధ్వకేక భయాంతకక్రూరదంష్ట్రదంష్ట్రి మారణ నిరృతి ధర్మపతి అధర్మపతి వియోక్తసంయోక్తకర్త విధాతధాతహర మృత్యు ధర్మ అక్షయాంతక భస్మాంతక వజ్రబాహుదహనజ్వలనహరఘాతుక పింగళహుతాశన అగ్నిరుద్ర త్రిదశాధిప పినాకిశాన్త అవ్యయ విభూతి వివర్ధన వజ్రదేహబుధఅజక పాలీశ రుద్ర విష్ణు బ్రహ్మ హాటకేశ్వర కూశ్మాండ కాలాగ్నిరుద్ర శ్రీకర్ణఔమకౌమారవైష్ణవ బ్రాహ్మ్య భైరవకృత అకృతస్థలేశ్వర సుబ్రాహ్మ్య పాజేశసౌమ్య ఇంద్రగాంధర్వ యక్షరాక్ష సపైశాచ సుస్థలేశ్వర శంఖకర్ణకాలాంజన మండలేశ్వర మహాండ ద్విరండ సకలాండస్థాణు స్వర్ణాక్ష భద్రకర్ణగోకర్ణ మహాలయ అవిముక్త రుద్రకోటివస్త్రాపద భీమేశ్వర మహేంద్ర అట్టహాస విమలేశ్వర నఖిల నాఖిల కురుక్షేత్ర గయాక్ష మహాభైరవకేదార శ్రీశైల మహాకాశ మధ్యమేశ్వర అమ్రాదికేశ్వర జలేశ్వర హరిశ్చంద్ర ఆకులేశ్వర డుండిముండి భారభూతి ఔషధిపుష్కరనైమిశ , అమరేశ్వర అంగుష్టమాత్రార్క ఈశాన ఏకేక్షణ ఏకపింగళ ఉద్భవ అభవ వామదేవ మహాద్యుతి శిఖేద ఏకవీర క్రోధ చండ శూర పంచాంతక సంవర్తజ్యోతిష మహాక్రోధ మహా