పుట:సీతారామాంజనేయ సంవాదము.pdf/48

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పీఠిక

29


ర్చుచు తత్త్వార్థమును బలుమాఱు వివరించి, సంశయముల నెల్లఁ దొలఁగించి జ్ఞానమును దృఢము చేయుచు సుప్రసిద్ధుఁడై యుండెను.

క. ఆనాగోరామునకున్ శ్రీనారాయణున కజునిచెలువున భక్తుం
   డై నెగడె నెల్లదిక్కులఁ, గోనేరుగురుండు తత్త్వకోవిదుఁ డగుచున్.29

టీక . ఆనాగోరామునకున్ = ఆనాగోరామగురువునకు, శ్రీనారాయణునకున్ = శ్రీవిష్ణునకు, అజునిచెలువునన్ = బ్రహ్మవలె ("నారాయణం పద్మభవం వసిష్ఠం" అని వేదాంతవిద్యాసంప్రదాయమునకు మొదటి గురువు విష్ణువు; ఆయనకు శిష్యుఁడు బ్రహ్మదేవుఁడు; ఆయనకు వసిష్ఠుఁడు అని చెప్పఁబడియున్నది. దాని ననుసరించి ఇచ్చట నీయుపమానము ప్రయోగింపఁబడిన దని తెలిసికొనునది. ) కోనేరుగురుండు = కోనేరుఁ డనుగురువు భక్తుండు ఐ. (శిష్యుఁడై యనుట.) తత్త్వకోవిదుఁడు అగుచున్ = తత్త్వజ్ఞానముకలవాఁడై, ఎల్లదిక్కులన్ = అన్నిదిక్కులయందును, నెగడెన్ = ప్రసిద్ధి వొందెను.

తా. శ్రీమన్నారాయణమూర్తికి బ్రహ్మదేవుఁడు శిష్యుఁ డైనట్లు అనాగోజీరామగురువునకుఁ గోనేరుగురువు శిష్యుఁ డయ్యెను. బ్రహ్మవేత్తలలో నుత్తముఁడై త్రిలోకములయందుఁ బ్రసిద్ధిఁ గాంచెను.

శా. ఆకాశీతలసేతుమధ్యకలితజ్యాధీశ్వరోద్యచ్ఛిర
    శ్శ్రీకోటీరమణిప్రభార్చితనిజాంఘ్రిద్వంద్వపంకేరుహుం
    డాకాశాదిసమస్తతత్త్వసముదాయాతీతవిశ్వేశుఁ డై
    శ్రీకోనేరుగురుండు మోక్షవరలక్ష్మీకాంతుఁడై రంజిలెెన్.30

టీక. ఆ....పంకేరుహుండు- ఆకాశీతలసేతుమధ్య = కాశీక్షేత్రము మొదలు సేతువువఱకుఁ గల మధ్యదేశమునం దంతటను, కలిత = ప్రకాశించుచున్న , జ్యా అధీశ్వర = ప్రభువులయొక్క , ఉద్యత్ = ప్రకాశించుచున్న, శిరః = శిరస్సులయందలి, శ్రీకోటీర = కాంతిగల కిరీటములయందలి, మణి = రత్నములయొక్క , ప్రభా= కాంతులచేత, అర్చిత = పూజింపఁబడిన, (అలంకరింపఁబడినది. అనుట.) నిజ = స్వకీయ మైన, అంఘ్రిద్వంద్వపంకేరుహుండు = కమలములవంటి పాదములు గలవాఁడును, (సకలప్రభువుల చేతను నమస్కరింపఁబడువాడు,) ఆకాశ...విశ్వేశుఁడు - ఆకాశాది = ఆకాశము మొదలగు, సమస్త = సకలములైన, భూతసముదాయ = పంచభూతములయొక్కయు వానివలనఁ బుట్టిన సకలప్రాణులయొక్కయు సమూహమును, అతీత = అతిక్రమించినవాడును, విశ్వేశుఁడు = ప్రపంచమును నియమించువాఁడును ఐ, మోక్ష...కాంతుఁడు - మోక్ష = మోక్షమనియెడు, పద = స్థానమనెడి, లక్ష్మీ = లక్ష్మి,