పుట:సీతారామాంజనేయ సంవాదము.pdf/47

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

28

శ్రీ సీతారామాంజనేయసంవాదము


క. ఆనరహరిసద్గురునకు, శ్రీనాగోరామగురుఁడు శిష్యుం డై వి
    జ్ఞానంబునఁ బ్రత్యక్ష, శ్రీనారాయణుఁ డనం బ్రసిద్ధి వహించెన్. 27

టీక. ఆనరహరి సద్గురునకున్ = నరహరియను గురువునకు, శ్రీ నాగోరామగురుఁడు= బ్రహ్మజ్ఞానవంతుఁడగు నాగోరాముఁ డనువాఁడు, శిష్యుండు ఐ, విజ్ఞానంబునన్ = పరబ్రహ్మమే తానని తెలిసికొనుటయందు, శ్రీ నారాయణుఁడు = లోకోత్తమ మగునారాయణమహర్షి, (ధర్మము నశించినప్పుడు దానినుద్ధరించుటకు నారాయణమహర్షి యను పేర నవతరించిన విష్ణువు) అనన్ = అనఁగా, ప్రసిద్ధిన్ = విఖ్యాతిని, వహించెన్ =పొందెను.

తా. నాగోరామగురువనువాఁడు ఆనరహరిగురునకు శిష్యుడై బ్రహ్మజ్ఞానప్రభావముచే నారాయణమహర్షి యొక్క యపరావతారమో యన ప్రసిద్ధిఁజెందెను.

శా. రాజమూర్తులతోడఁ బెంపెసఁగువైరాగ్యోపరత్యాళు లు
    త్తేజం బొప్ప సహాయు లై మెఱయ నద్దివ్యప్రబోధస్ఫుర
    ద్రాజాస్య న్వరియించి మోక్షసుఖసామ్రాజ్యంబుతో నొప్పె నా
    గోజీరామగురుండు పండితులు కోర్కు ల్దీర సేవింపఁగన్. 28

టీక. రాజన్మూర్తులతోడన్ = ప్రకాశించుచున్నయాకారములతో, (మనుష్యరూపమును దాల్చియనుట.) పెంపు ఎసఁగు = వృద్ధిపొందుచున్న, వై .. . ఆళులు - వైరాగ్య = ఇహపరలోకములయందు ఇచ్ఛలేకపోవుట (చిత్తవిశ్రాంతి) అనెడు, ఆళులు = చెలులు, ఉత్తేజంబు = అధికమగు తేజస్సు, ఒప్పన్ = ప్రకాశింపఁగా, (సకలలోకములయందును ప్రసిద్ధి కలుగునట్లు) సహాయులు ఐ = సహాయభూతురాండ్రై, మెఱయన్ = ప్రకాశింపఁగా, (వైరాగ్యము, ఉపరతి యనియెడు చెలికత్తెలతోఁ గూడిన,అనుట) అద్ది .. స్యన్ — అద్దివ్య = ఆ యుత్తమమైన, ప్రబోధ = బ్రహ్మజ్ఞాన మనియెడు, స్ఫురత్ = ప్రకాశించుచున్న (సౌందర్యముగల), రాజస్యన్ = స్త్రీని, వరియించి = వివాహమాడి, నాగోరామగురుండు = నాగోరామగురువు, పండితులు = విద్వాంసులు, (లేక, బ్రహ్మజ్ఞానులు,) కోర్కుల్ దీరన్ = కోరినకోర్కులు సిద్ధించుటకై , సేవింపఁగన్ = సేవించుచుండగా, మోక్ష...తోన్ - మోక్షసుఖ= బ్రహ్మానంద మనియెడు, సామ్రాజ్యంబుతోన్ = చక్రవర్తిత్వముతో, (పరమానందమే రాజ్యమనుట.) ఒప్పెన్ = ప్రకాశించుచుండెను.

తా. ఆ నాగోరామగురువు వైరాగ్యోపరతులు చెలికత్తియలుగాఁ గలిగి, జగత్ప్రసిద్ధిఁచెందియున్న బ్రహ్మజ్ఞానమను నుత్తమకాంతను వివాహమై, మోక్షసుఖ మనియెడు సామ్రాజ్యమునకు ప్రభువై బ్రహ్మవేత్త లగువారలకోర్కుల నెఱవే