పుట:సీతారామాంజనేయ సంవాదము.pdf/45

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

26

శ్రీ సీతారామాంజనేయసంవాదము


సర్వకాలసర్వావస్థలయందు నొక్కటెరీతిగానున్న) సమాధిని = ధ్యానమును, చూచి, (పరమాత్మ సర్వవ్యాపకుఁడు గావున ఆయన నెఱింగినయోగి. ఏయేవిషయముల సంకల్పించినను సర్వము సమాధి నాచరించినట్లే యగునని తెలిసికొనవలయును) ప్రహ్లాదుఁడు, ఆశ్చర్యపరతన్ = మిగులనాశ్చర్యము గలిగియుండుటను, ఒందన్ = పొందుచుండఁగా, స్వకృతగీతాదిశాస్త్రభాష్యంబులు ఎల్లన్ = తనచే రచియింపఁబడిన భగవద్గీతాభాష్యము మొదలగునవి యన్నియు, (ఏకోగురుస్వామిచే రచియింపబడిన వ్యాఖ్యానము లేవియును గానరావు. కావునఁ బ్రకృతమున నీకవి శంకరభగవత్పాదులకును ఏకోగురుస్వామికిని అభేదము చెప్పినాఁడని తోచుచున్నది.) ధాత్రిన్ = భూమియందు, వేదతుల్యంబులు ఐ = వేదములతో సమానములై, వెలయుచున్ = ప్రకాశించుచు, (లేక, ప్రసిద్ధిఁ జెందుచు,) ఉండన్ = ఉండగా, వామదేవ-శుక-అర్జున-వ్యాస-భీష్మ-సదృశుఁడు = వామదేవాదులతో సమానుఁడు అగు, ఏకోజనార్ధనస్వామి = జనార్దనయోగీంద్రుని శిష్యుఁడగు ఏకోగురుస్వామి, (కుమారునిపేరుతోఁగూడ తండ్రి పేరును, శిష్యునిపేరుతోఁ గూడ గురువుపేరును కలిసి చెప్పుట కొన్నిదేశములలో నాచారము. ఆంధ్రకావ్యములలోఁ బలుచోట్ల నిట్టి ప్రయోగములను జూడవచ్చును.) వెలసెన్ = ప్రసిద్ధుఁడై యుండెను.

తా. తనవైరాగ్యమును జూచి సిగ్గుపడి సనకసనందనాదులు సత్యలోకమును విడిచివచ్చుటకు సందేహించుచుండ తనభ క్తిచేఁ గట్టుబడి భక్తపరాధీనుఁడగు శ్రీకృష్ణుఁడు తనగృహమునందే వసియించి సర్వవిధముల తోడ్పడుచుండఁ ద్రిభువనపావనములని ప్రఖ్యాతిఁ జెందియున్న గంగాదిపుణ్యనదు లన్నియుఁ దన బ్రహ్మజ్ఞానతీర్థమున నోలలాడి మిగులఁ బ్రభావమును సంపాదించుకొనుచుండఁ దారచించిన గీతాభాష్యాదులు వేదములట్లు పరమప్రమాణములై తనరారుచుండ నజ్జనార్ధనయోగీంద్రశిష్యుఁ డగు ఏకోగురుస్వామి వామదేవుఁడు, శుకుఁడు, అర్జునుఁడు, వ్యాసుడు, భీష్ముడు మొదలగువారితో సమానుఁడై ప్రసిద్ధి గాంచెను. (అమ్మహాత్ముని పరబ్రహ్మనిష్ఠను జూచి ప్రహ్లాదుడు సైతము ఆశ్చర్యపడుచుండెననుట.)

క. ధరలో నారాయణునకు, నరుగతి నేకోజనార్దనస్వామికి శ్రీ
    నరహరి మహేశ గురుఁ డ, చ్చెరువుగ సద్భక్తి మెఱయ శిష్యుం డయ్యెన్.

టీక . ధరలోన్ = భూమిపై, నారాయణునకున్ = శ్రీకృష్ణునకు, నరుగతిన్ = అర్జునుని యట్లు, ఏకోజనార్దనస్వామికిన్ = జనార్ధనయోగీంద్రుని శిష్యుఁడగు ఏకోగురుస్వామికి, నరహరిమహేశగురుఁడు = నరహరి మహేశ్వరుఁడను మహాత్ముడు, (ఇచ్చట మహేశ్వరుఁ డనునది నరహరి యనునాతని తండ్రిపేరుగా నుండునని యూహింపవలసియన్నది. అట్లు గాకున్నను యతులకు శివవాచకములను విష్ణువాచ