పుట:సీతారామాంజనేయ సంవాదము.pdf/38

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పీఠిక

19


విరుద్ధకామములు పనికిరావనుట.) ప్రద= ఇచ్చునట్టి, చతురక్షర = నాలుగు అక్షరములతో, సమన్విత = కూడిన, నారాయణ= నారాయణ అనెడు పేరు యొక్క , (ఈనారాయణపదమునందలి నాలుగు అక్షరములును, క్రమముగ నాలుగుపురుషార్థములను గలుగఁజేయు నని భావము.) స్మరణపూర్వకంబుగాన్ = స్మరించుటయే (లేక, ఉచ్చరించుటయే) మొదలగునట్లుగా ఉచ్చరించుచు, ఆంగీకరించి, కలకలనవ్వుచువ్ , శరీర...ఆత్ముఁడవు-శరీరత్రయ = స్థూలసూక్ష్మకారణము లనుమూఁడు శరీరములకును, విలక్షణ = లేనట్టియు, అవస్థాత్రయ = జాగ్రత్త స్వప్నము సుషుప్తి అనియెడు మూఁడు అవస్థలకును, సాక్షి= చూచునట్టి, పంచకోశ = అన్నమయము, ప్రాణమయము, మనోమయము, విజ్ఞానమయము, ఆనందమయము అను నైదుకోశములకంటెను, (కోశ మనఁగా; ఆవరించునది. పరమాత్మస్వరూపము తెలియకుండునట్లు ఆవరించుచున్నవి గావున ఈ అన్నమయాదులకుఁగూడఁ గోళములని పేరు గలిగెను.) వ్యతిరిక్త = వేఱైనట్టియు, సత్ =సత్తామాత్రస్వరూపుఁడై నట్టియు, (సత్త అనఁగా: ఉనికి. ఇదియె పరబ్రహ్మమునకును జీవునకును స్వరూపము.) చిత్ = చైతన్యము, ఆనంద = ఆనందము, స్వరూప = స్వరూపముగాగల, ప్రత్యగాత్ముండవు అయిన జీవుఁడవైన, (సర్వదేశములయందును, సర్వకాలములయందును, సర్వవస్తువులయందును ఉండుట అనునొక స్వరూపముతో నిలిచియుండుట.) చైతన్యము = (జ్ఞానము), ఆనందము (ఇదియె జీవునియాకారము.) నీవ = నీవే, సత్యజ్ఞానానందస్వరూప పరమాత్ముండను = సచ్చిదానంద స్వరూపము గాఁగల పరబ్రహ్మస్వరూపుఁడను, అయిన, "నేనం నేనే, సచ్చిదానంద స్వరూపప్రత్యగాత్ముండవు, అయిన, నీవు, అని, సర్వ... అర్థంబు-సర్వ = సారాంశ మగు ఉపనిషత్సారభూత = (ఉపనిషత్తులయొక్క పరమాభిప్రాయము.) అర్థంబుఅయిన = విషయమైన, పరమతత్త్వరహస్యార్థంబున్ = పరతత్త్వమనియెడు రహస్యవిషయమును, ఉపదేశించి, ఈ...దృష్టిచేన్ - ఈ = పైన వివరింపఁబడిన, అభేదవిజ్ఞానదృష్టిచేన్ = జీవబ్రహ్మైక్యము నెఱుంగుట యనెడు దృష్టి చేత, నిరంతరంబున్ = సర్వకాలములయందును, నన్నున్ = పరబ్రహస్వరూపుఁ డగు నన్ను, అవలోకించుచున్ = చూచుచు (నేను పరబ్రహ్మమును ఒక్కటియే యని నిదిధ్యాసనము చేయుచు), జీవన్ముక్తిసుఖంబున్ = బ్రతికియుండియే మోక్షమును జెందుట (భ్రాంతిని విడుచుట) వలనఁ గలుగునానందమును, ('నేనుమనుష్యుఁడను బ్రాహ్మణుండను' అను మొదలగు నభిమానము లున్నంతకాలము బహువిధము లగుదుఃఖములు కలుగును.'నాకీప్రపంచమునందలి వికారము లంటవు.నాకును పరబ్రహ్మమునకును భేదము లేదు' అనుజ్ఞానము దృఢముగఁ గలిగెనేని యీ దుఃఖములు వానిని బాధింపవు. ఇదియే జీవన్ముక్తి) అనుభవింపుము, ప్రా... సమయంబున - ప్రారబ్ధ = ప్రస్తుతశరీరమునందు సుఖదుఃఖఫలముల నొసంగుట కారంభించిన కర్మముయొక్క, భోగ = అనుభవముయొక్క