పుట:సీతారామాంజనేయ సంవాదము.pdf/35

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

16

శ్రీ సీతారామాంజనేయసంవాదము


అవ. తా నీ ప్రబంధము నొనర్చుటకుఁ గల కారణము నీ క్రింద వివరించుచున్నాడు.-

వ. అని యిష్టదేవతాప్రార్థనంబును సద్గురుకీర్తనంబును సంస్కృతాంధ్ర
   సత్కవిస్తోత్రంబును గావించి యేను ముముక్షుజనహితంబును
   సంసారసాగరోత్తారకంబును దారకసాంఖ్యామనస్కాత్మకంబును జీవ
   బ్రహ్మైక్యసాక్షాత్కారసాధారణకారణంబు నైనరాజయోగం బంత
   యు నొక్కప్రబంధంబు గా రచియింప నిశ్చయించి పరమైకాం
   తంబు శ్రీగురుమంత్రదేవతాతత్త్వానుసంధానంబు సేయుచున్న
   సమయంబున. 15

టీ. అని=ఇట్లు, ఇష్టదేవతాప్రార్ధనంబును = ఇష్టదేవతేలను వేఁడుటయును, సద్గురుకీర్తనంబును =సద్గురువులను నుతించుటయు, సంస్కృతాంధ్రసత్కవిస్తోత్రంబును = సంస్కృతకవుల నాంధ్రకవుల నుతించుటయును, కావించి = చేసి, ఏను = నేను, ముముక్షు... హితంబును - ముముక్షు = మోక్షమునుగోరు, జన = మనుష్యులకు, హితంబును = మేలుసేయునదియును , సంసార...బును సంసార=సంసారమనియెడు, సాగర=సముద్రమునుండి, ఉత్తారకంబును = తరింపజేయునదియు , తారక... బును... తారక = తారకయోగము, సాంఖ్య = సాంఖ్యయోగము, అమనస్క = అమనస్కయోగము, ఆత్మకంబును = స్వరూపముగాఁ గలదియును, జీవ .... కారణంబును ..జీవ = జీవునకును,బ్రహ్మ = పరబ్రహ్మమునకునుగల, ఐక్య= అభేదమును, సాక్షాత్కార = ప్రత్యక్షముగాఁ దెలిసికొనుటయందు, సాధారణ = సుఖమైన, కారణంబును = సాధనంబును, ఐన, రాజయోగంబున్ అంతయున్ = రాజయోగమును సంపూర్ణముగా, ఒక్క ప్రబంధంబుగా = ఒక్క కావ్యముగా, రచియింపన్ = చేయుటకు, నిశ్చయించి, పరమై .. బునన్ - పరమ = శ్రేష్ఠమైన, ఏకాంతంబునవ్ = విజనస్థలమునందు, శ్రీ...అనుసంధానంబున్ - శ్రీ=శోభాయుక్తుఁడైన, గురు = గురువగుమహాదేవాచార్యుఁడె స్వరూపముగాఁగల, మంత్రదేవతా = తారకమంత్రాధిదేవత (యగు శ్రీరామమూర్తి) యొక్క, తత్త్వ = పరమార్థపరబ్రహ్మస్వరూపముయొక్క, అనుసంధానంబున్ = ధ్యానమును, చేయుచున్, ఉన్న సమయంబునన్.

తా. ఇట్లు ఇష్టదేవతలఁ బ్రార్థించి సద్గురువులఁ గొనియాడి సంస్కృతాంధ్రకవులకు నమస్కరించి సంసార మనుసముద్రమును దరింపఁజేయుటకును, జీవునకును బ్రహ్మమునకును భేదము లేదనువిషయము ప్రత్యక్షముగఁ దెలియఁజేయుటకును, సుఖమగు సాధనమై, మోక్షాపేక్ష గలవారలకు మిగుల మేలుచేయు రాజయోగమును దారకసాంఖ్యామనస్కము లను మూఁడుభేదములు గలదానిని సమగ్రముగాఁ