పుట:సీతారామాంజనేయ సంవాదము.pdf/27

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

8

శ్రీ సీతారామాంజనేయసంవాదము

టీ. తనరన్ = ఒప్పునట్లుగా, కాయముచేతన్ = శరీరముచే, రామ.... దాస్యంబున్ - రామ= శ్రీరామునియొక్క, చరణద్వంద్వ = పాదయుగ్మముయొక్క, దాస్యంబున్ = సేవను, తగువాక్కుచేన్ = యుక్తమైన (వేదాధ్యయనము, సత్యభాషణము మొదలగు వాఙ్మయతపస్సుతో కూడిన దగుటచే నిర్మలమైన) వాక్కుచేత, అనిశమున్ = ఎల్లప్పుడును, శ్రీరామ... కీర్తనమున్ - శ్రీరామ = శ్రీరామునియొక్క నామ= నామధేయముయొక్క, ప్రకీర్తనమున్ = జపమును, చిత్తముచేన్ = మనస్సు చేత, తదీయ... ధ్యానమున్ - తదీయ = ఆ శ్రీరామునిసంబంధ మైన, పరతత్త్వ= యథార్థస్వరూపముయొక్క (బ్రహ్మస్వరూపముయొక్క), ధ్యానమున్ = ధ్యానించుటను, హెచ్చినభక్తితో, చేయునాహనుమంతున్, మదభీష్టార్థంంబు— మత్ = నాచేత, అభీష్ట = కోరఁబడిన, అర్థంబు = విషయము, సిద్ధింపఁగన్ = సిద్ధించునట్లుగా (ఈ గ్రంథము నిర్విఘ్నముగా బరిసమాప్తి యగుటకై యనుట.), సముపాశ్రయింతున్ = ఆశ్రయించెదను.

తా. మిగుల భ క్తిగలవాఁడై తనశరీరముచే శ్రీరామపాదసేవయు వాక్కుచేఁ దన్నామస్మరణంబును మనస్సుచేఁ బరమార్థస్వరూపధ్యానంబును గావించుచుఁ ద్రికరణశుద్ధిగా నా శ్రీరాముని సేవించుచున్న యాహనుమంతుని భక్తాగ్రేసరుని నాశ్రయించెదను. అవ్విభుఁడు నా కభిమతార్థముల సమకూర్చును గాక !

అవ . “యస్య దేవే పరా భక్తిః యథా దేవే తథా గురౌ” = "ఎవనికి దేవునియందు అధికముగ భక్తియుండునో గురువునందుఁగూడ నట్లేయుండునో వానికిని" అనున్యాయము ననుసరించి కవి గురువుల వినుతించుచున్నాడు.-

క. ఆరయ మద్బాల్యంబున, గారవమునఁ జిత్తశుద్ధికరముగ నాకుం,
   దారకయోగముఁ దెలిపిన, నారాయణగురువులను మనంబునఁ గొలుతున్.

టీ. ఆరయన్ = విచారింపఁగా (లేక , పరతత్త్వస్వరూపమును విచారించుటకు, విచారించుశక్తి గలుగుటకు), మద్బాల్యంబునన్...మత్ = నాయొక్క, బాల్యంబునన్ = బాల్యమునందు ('చెప్పిన విషయములను గ్రహించి వానిని మనస్సునందు నిలుపుకొనఁగలవాఁడు బాలుఁడు' అనువాక్యము ననుసరించి యిచ్చట బాల్యశబ్దమునకు అర్థము చెప్పవలయును. లేకున్న బాలుఁడు వేదాంతశాస్త్రోపదేశమునకుఁ దగియుండఁడుగదా!), గారవమునన్ = ప్రేమతో, చిత్తశుద్ధికరముగన్ = మనసును పరిశుద్ధము చేయునట్లుగా, నాకున్, తారకయోగమున్ = అక్షి పురుషు నుపాసించువిధమును (యోగస్వరూపము ఈ ప్రథమాశ్వాసమునందు వివరింపఁబడును.), తెల్పిన నారాయణగురువులను = ఉపదేశించిననారాయణుఁ డనుగురువును, మనంబునన్ = మనస్సునందు, తలఁతున్ = స్మరించెదను.

తా. నేను బ్రహ్మవిద్యార్థి నై యున్నకాలమున నన్ననుగ్రహించి మనసును