Jump to content

పుట:సీతారామాంజనేయ సంవాదము.pdf/165

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

146

శ్రీ సీతారామాంజనేయసంవాదము

మునకు జ్ఞానమే ప్రధానసాధనము, శ్లో. "బోధోఽన్యసాధనేభ్యో హి సాక్షాన్మోక్షై కసాధనం, పాకస్య వహ్ని వద్జ్ఞానం వినా మోక్షో న సిధ్యతి.” “కర్మ మొదలగు నితరసాధనములు జ్ఞానమును కలిగించునే కాని మోక్షము నియ్యవు. మోక్షమునకుఁ ప్రత్యక్షసాధనము జ్ఞానమే. వీని కన్నిటికంటే నగ్నియే ప్రధాన మైనట్లు మోక్షము న కీజ్ఞానమే ప్రధానము" ఆని యాత్మబోధ.)

తా. లోకమున భూమిలో నిక్షేపింపఁబడినధనమును తెలిసికొనఁగోరువారు దానికి సాధన మగుధనాంజనమును సంపాదించునట్లు పరమాత్ముని యథార్థస్వరూప మను ఎఱుంగఁగోరువారు తారకయోగాభ్యాసమును దప్పక చేయవలయును. అట్లు చేసినయెడలఁ బరమాత్తుని యథార్థరూపమును (అనఁగా: నాయనకును తనకును భేదము లే దనువిషయమును) సులభముగఁ దెలిసికొనవచ్చును.


   తే. పలలమును జూపి డేగను బట్టురీతి
       నమృతసమనాదబిందుకళానుభూతి
       సుఖము నొందించి మఱిగించి చొక్కఁజేసి
       యింద్రియమనంబుల వినిగ్రహింపవచ్చు.116

టీక . పలలమున్ = మాంసమును, చూపి, డేగను, పట్టురీతిన్ = పట్టుకొనునట్లు, అమృ. . .ఖమున్ - ఆమృతసమ = అమృతముతో సమాన మగు, నాదబిందుకళ = నాద బిందుకళలయొక్క, అనుభూతి = అనుభవ మనియెడు, సుఖము = సుఖమును, ఒందించి = పొందించి, మఱిగించి = ఆసుఖమునం దాసక్తి కలిగించి, చొక్కఁజేసి = పరవశము లగునట్లు చేసి, ఇంద్రియమనంబులన్ , వినిగ్రహింపవచ్చు = జయింపవచ్చును.

తా. మాంసమును జూపి దానిపై నాసచే వచ్చిన డేగను ఎంత సులభముగాఁ బట్టు కొనవచ్చునో ఈనాదబిందుకళలు జూపి కూడ యింద్రియములను మనసును అంతసుల భముగా నిగ్రహింపవచ్చును. ఈ నాదబిందుకళలు అమృతసమానములు. అమృతమును బానముఁ జేయువాని కెంతకాలమునకైన నెట్లు తృప్తి కలుగదో అట్లే నాదముల విను నప్పుడుకాని బిందుకళలను చూచునప్పుడుకాని మనసునకుఁ దృప్తి జనింపదు. కావున, నామనసునకు వానినిఁ జూపి యందు రుచిని కలిగించినయెడల నది (మనస్సు) యచ్చట నుండి చలింపక తన్మయ మగును. కొంతకాలమునకు శూన్యమైకూడ పోవును. ఆమన సుతోకూడ యింద్రియములును తన్మయత్వమును చెంది శూన్యములగును. ఇంతకంటే చక్కనిమనోనిగ్రహోపాయ మేదికలదు.


    ఆ. వేద మట్లు గాన నాదబిందుకళాను
        భవముఁ దెలిపె మొదలఁ బండితులకు