Jump to content

పుట:సీతారామాంజనేయ సంవాదము.pdf/158

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్ర థ మా శ్వా స ము.

139

బడును. దృష్టి భ్రూమధ్యమునకుఁ బ్రసరించుటయే కష్టము. కనులు తెఱచియున్నప్పుడొకవేళ ప్రసరించినను ప్రసరింపవచ్చునుగానీ, మూసియున్నప్పు డెట్లు ప్రసరించును? అని సంశయించెదవేమో! బాహ్యదృష్టి విషయమున నిట్టిసంశయము కలుగవచ్చును కాని యంతర్దృష్టి విషయమునఁ గాదు. కనులు మూసి భ్రూమధ్యము జూచుట యనఁగా చూచుచున్నామని సంకల్పించుటయే కాని మఱి యేమియు కాదని తెలిసికొనవలయును.

క.

లోచనములు గదలింపక, యాచార్యోక్తస్వనాసికాగ్రం బెపుడున్
గోచరముగఁ జూచిన నది, భూచరి యనుముద్ర యగును బోధశరణ్యా.

106

టీ. బోధశరణ్యా – బోధ = జ్ఞానమే, శరణ్యా = రక్షకముగాఁ గలయోయాంజనేయా! (బ్రహ్మజ్ఞానమును గోరుచున్న హనుమంతుఁడా) లోచనములు = కన్నులను, కదలింపక = చలింపఁజేయక (రెప్ప లార్పక దృష్టినిఁ జెదరనీక), ఆచా... గ్రంబున్ - ఆచార్యోక్త = గురువుచే నుపదేశింపఁబడిన, స్వనాసికాగ్రంబుతో = తనముక్కుకొనను, ఎపుడున్ = యోగాభ్యాసము చేయనంత కాలము, గోచరముగన్ = కనఁబడునట్లుగా, చూచినన్ = చూచినట్లయిన, అది = ఆ చూపు, భూచరి యను ముద్ర = భూచరి యనెడుముద్ర (అగున్.)

తా. ఓవివేకవంతుఁడా! కనులు కదలనీక ముక్కుకొనపై దృష్టిని నిలిపి చూచునట్టిముద్రకు భూచరిముద్ర యని పేరు.

ఆ.

కనులు సగము మూసి ఘననాసికామధ్య
మయందుఁ జూపుఁ జెదరనీక
నిలిపి మీఁద మున్న నిటలంబు గాంచిన
మధ్యలక్ష్య మగుఁ గుమారతిలక!

107

టీ. కుమారతిలక = పుత్రరత్నమా! (సీతాదేవిచే హనుమంతుఁడు పుత్రునివలెఁ బ్రేమించఁబడుచుండుఁ గావున నిట్లు సంబోధింపఁబడియెను) కనులు సగము మూసి = కన్నులను సగభాగము మూసి సగము తెఱచి, ఘన...దున్ - ఘన = గొప్పదియగు, నాసికా = ముక్కు యొక్క, మధ్యసీమయందున్ = నడుమ, చూపున్ = దృష్టిని, చెదరనీక = నిలిపి, మీఁదనున్న = పైభాగమునందున్న, నిటలంబున్ = భ్రూమధ్యమును, కాంచినన్ = చూచినట్లయిన, మధ్యలక్ష్యమగున్ = మధ్యమాముద్ర యగును.

తా. ఓ పుత్రరత్నమా! అట్లే కనులను సగము మూసి సగము తెఱచి ముక్కుయొక్క నడిమిభాగమునందు దృష్టిని నిలుపవలయును. అచ్చటనుండి పైభాగముననున్న భ్రూమధ్యమును గాంచవలయును. ఇట్లు చూచుటకు మధ్యమాముద్ర యని పేరు.