136
శ్రీ సీతారామాంజనేయసంవాదము
స్థితుఁ డై శాంతమనస్కుడై స్వగురుమూర్తి ప్రోక్తలక్ష్యార్థసం
గతి యామద్వయ మభ్యసింపఁ దగు యోగం బంచితోద్యోగుఁడై. 100
టీ. యత .. రుఁడై - యత = నియమింపఁబడిన, ధీ = బుద్ధి, చిత్త = మనస్సు, మరుత్ = ప్రాణము, దశేంద్రియ = జ్ఞానేంద్రియకర్మేంద్రియములు, తను శరీరము, (వీనియొక్క,) వ్యాపారుఁడై వృత్తులుగలవాఁడై, మౌనియై = మౌనముగలవాఁడై, హత...రుఁడై-హత = పోఁగొట్టబడిన, కామ = కామము, ఆది= మొదలగు, వికా రుఁడై = వికారములుగలవాఁడై (కామక్రోధాదులను జయించి అనుట. ) గతభయుండై = ఆధ్యాత్మికము మొదలగు తాపములవలనఁ గలుగు భయములేనివాఁడై, బ్రహ్మచారి వ్రత స్థితుఁడై = బ్రహ్మచర్యవ్రతమును బూనినవాఁడై, శాంతమనస్కుడై = చిత్తశాంతిగల వాఁడై, స్వగు...గతిన్ , స్వగురుమూర్తి = తనకు గురువగుమహాత్మునిచే, ప్రోక్తం = ఉప దేశింపఁబడిన, లక్ష్య=గుఱియొక్క, అర్థ = విషయముతో (అనఁగా తన గురువు తన్ను ధ్యానింపుమని చెప్పిన విషయముతో) సంగతి = సంబంధము గలుగునట్లుగా, యోగం బు = ఆతారకయోగమును, అంచి ... గుఁడై అంచిత = ఒప్పుచున్న, ఉద్యోగుఁడై = ప్రయ త్నముఁగలవాఁడై యామద్వయము = రెండుజాముల కాలము, ఆభ్యసింపఁదగున్.
తా. ఇట్లు మిగులనియమము గలిగి బుద్ధి, (నిశ్చయించు నంతఃకరణము), చిత్త ము (సంశయించు నంతఃకరణము), ప్రాణవాయువు, దశేంద్రియములు అనువానివృ త్తుల నడంచి దానిమూలమున శరీరచాంచల్యమును నిలిపి మౌనవ్రతమునుబూని కామ క్రోధాదివికారములఁ దొలఁగించి చిత్తశాంతి గల్గి నిర్భయుఁడై బ్రహ్మచర్యమును బూని తనకు గురు వుపదేశించిన లక్ష్యము పైఁ జిత్తమును నిలిపి రెండు జాముల కాలము పూనికతో యోగాభ్యాసము నాచరింపవలయును.
క. మారుతి యీనియంబులు
తారకసాంఖ్యామనస్కతత్పరులకు సా
ధారణము లగుచు వెలయుం
దారకయోగుల కతిప్రధానము లందున్. 101
టీక. మారుతి = ఆంజనేయా' ఈనియమంబులు= పైఁ జెప్పఁబడిన అధికారిదేశము మొదలగునియమములు, తారకసాంఖ్యామనస్కతత్పరులకున్ = తారక, సాంఖ్య, ఆమ నస్కము అనుమూడు విధములగు రాజయోగము నాచరించువారలకుఁ గూడ, సాధా రణములగుచున్ = సమానములై, వెలయున్ = ఒప్పుచున్నవి. (తారక, సాంఖ్యామనస్క ములలో దేని నాచరించినను పైనియమముల నసలంబింపవలసినదే యనుట.) అందులో ఆమూఁడువిధము లగుయోగములు నాచరించువారలలో, తారకయోగులకున్ = తారక