ప్ర థ మా శ్వా స ము.
135
తే. జక్కఁగా నిక్కి దృక్కులు ముక్కు చక్కిఁ
జిక్కఁ దక్కించి తక్కినదిక్కుఁ గనక
మిక్కిలి దశేంద్రియంబుల స్రుక్కఁ జేసి
ఫలితముగ యోగ మభ్యసింపంగ వలయు. 99
టీక. వితతమై=విశాలమై, విజనమై = సందడిలేనిదై, విమలమై పరిశుద్ధమై, సుఖమై...ఈఁగలు దోమలు మొదలగు వాని బాధలేక సౌఖ్యము గలుగునట్లు చేయున దియై, పొసఁగు=ఉన్న, వివిక్త = ఏకాంతమగు, దేశమ్మునందున్ = స్థలమునందు, సమ భూమియందు, నిశ్చలముగాన్ = స్థిరముగా, మిఱ్ఱుపల్లములు గాకుండన్ = ఒక పార్శ్వ మున ఎత్తుగను మఱియొక పార్శ్వమున తగ్గుగ నుండకుండునట్లును, పేలవము గాఁగన్ = మృదువుగానుండునట్లును, వరుసన్ = క్రమముగా, కుశా ... బులు- కుశ = దర్భాసనము, అజిన = కృష్ణాజినము, వస్త్రంబులు = వస్త్రము (వీనిని,) అనువుగాన్ = చక్కఁగా, ఫఱచి, ఒప్పుగన్, వానిపైన్ = ఆ దర్భాసనాదులమీఁద, తిరముగన్ = స్థిరముగా, పూని = యత్నముతో, పద్మా. . . నుఁడై - పద్మాసనా = పద్మాసనమునందు, ఆసీనుఁడై= కూర్చుండి, ఆమీఁదన్ = తరువాత, కాయమధ్యమము - నడుమును, గళమున్ = కంఠమును, శిరమున్ = తలను, చక్కగా నిక్కి = వక్రత లేకుండ నిక్కి, దృక్కులు= చూపులను, ముక్కుచక్కిన్ = ముక్కు వైపునకు, చిక్కన్ = ప్రసరించునట్లు, తక్కించి = కూర్చి, తక్కినదిక్కుఁ గనక = రెండవవైపునుజూడక, దశేంద్రియంబులున్ = జ్ఞానకర్మేంద్రియములఁ బదింటిని, మిక్కిలి, స్రుక్కఁజేసి = ఆడించి (అనఁగా వానివిషయ ములనుగూర్చి పోనీక నిలిపి), ఫలితముగన్ = సిద్ధి యగునటుల, యోగము = రాజయోగ మును, అభ్యసింపంగవలయున్ = అభ్యాసము చేయవలయును.
తా. విశాలముగాను, నిర్మలముగాను, జలశూన్యముగాను, ఈగలు, దోమలు మొదలగువాని బాధ లేనిదిగాను బ్రకాశించుచుండు రహస్యస్థలము నొకదానిని యోగాభ్యాసస్థలముగా నేర్పఱుచుకొనవలయును. ఆప్రదేశము సమభూమియై యుం డవలయును. అందుఁ గ్రమముగ దర్భాసనకృష్ణాజినవస్త్రముల నొకదానిపై నొక దానిఁ బఱచి యాయాసనమును సమముగ నమరింపవలయును. దానిపైఁ గూర్చుండి యోగాభ్యాసమున కారంభించునప్పుడు నడుము, మెడ, శిరస్సు అను వానిని జక్కగ నిలిపి తనదృష్టులను నాసాగ్రమునందుఁ జేర్చి రెండవవైపునకుఁ జలింపనీక నిలుప వలయును.
మ. యతధీచిత్తమరుద్దశేంద్రియతను వ్యాపారుఁ డై మౌని యై
హతకామాదివికారుఁ డై గతభయుం డై బ్రహ్మచారివ్రత