పుట:సీతారామాంజనేయ సంవాదము.pdf/15

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

viii

పీఠిక


ఈ కావ్యమునందు విషయమువలెనే కవిత్వమును జాల సమంజస ముగనే యున్నది. దురవగాహమగు వేదాంతమును సులభ శైలిలోఁ గ్లిష్ట పదసందర్భము గలుగకుండఁ బద్యములో నిముడ్చుట సామాన్యమగుపని కాదు కదా! వేదాంతములో నెంతయో యనుభవము కలిగి వశ్యవా క్కులు గలకవికిఁ గాని యిట్టిసామర్థ్యము గలుగ నేరదని చెప్పవచ్చును. ఇంతియకాక యీకవి తన గ్రంథమునం దచ్చటచ్చట నేకాక్షర ద్వ్యక్షర ముక్తపదగ్రస్తాదిశబ్దచిత్రములు గలపద్యములఁ బెక్కింటిఁ జొప్పించి నిజ పాండిత్యప్రకర్షను వెల్లడించియున్నాడు. ఇట్టి యుత్తమ గ్రంథ మెం తయో శ్రమపడి పూర్వముద్రితగ్రంథములకన్న మిన్నయగునట్లు సుల భశైలిలో నద్వైత విషయముల నెల్లం జక్కఁగఁ జర్చించుటీకాతాత్పర్య ములతో ముద్రింపఁబడినది. విచారించి చూచినఁ బెక్కువిషయములఁబట్టి యీగ్రంథ మద్వైతులకుఁ బరమోపకారకమగునని నొక్కి వక్కాణింప వలసియున్నది. ఇకమనదేశమునందు నూటికిఁ దొంబదిమంది యద్వైత జిజ్ఞాసువు లీగ్రంథమును దప్పక చదువుచుండుటంబట్టియే యీ గ్రంథ ప్రాశ స్త్యము వెల్లడియగుచుండ వేఱుగ వ్రాయ సక్కఱలేదు గదా ! కాబట్టి రాజయోగజిజ్ఞాసువు లందఱు నీగ్రంథమును జదివి తత్స్వరూపమును జక్కగ నెఱింగి బ్రహ్మానందము నొందుదురుగాక!

ఉత్పల వేంకటనరసింహాచార్యులు.