పుట:సీతారామాంజనేయ సంవాదము.pdf/14

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పీఠిక

vii

ఇందు మొదటఁ బ్రథమాశ్వాసము నందుఁ దారక యోగమును నిరూపించుచు, తొలుత యోగాభ్యాసమువలనఁ బ్రాణవాయువు స్వాధీన మగుననియు, వాయువునకు మనసునకును సంబంధముండుటవలన వాయు జయముతోఁగూడ మనోజయము గలుగుననియు, నింద్రియముల కన్ని టికి మనసే ప్రభువు.గాన వెంటనే యింద్రియజయము గూడఁ జేకూరు ననియు, నిట్లన్నియు జయింపఁబడెనేని సంసారముకు ముఖ్యకారణ ములగు కామక్రోధాదులు నశించి జీవునకు బ్రహానందసుఖము గలుగు ననియు సహేతుకముగ సయుక్తికముగ యోగఫలమును నిరూపించి పిదప యోగాభ్యాసము సేయువారనుసరింపఁ దగినయాహారాది నియమములు మొదలుకొని- యోగమఠలక్షణము, పంచముద్రాలక్షణము, సూర్య చంద్రమండలకళానిర్ణయము, హంసతత్వపదేశము మున్నగువానిని విపులముగ వివరించి తారకయోగమును ముగించెను.

రెండవయాశ్వాసమునందుఁ బరబ్రహ్మస్వరూపము, భావాభావ పదార్థస్వరూపము, మాయాస్వరూపము, ప్రపంచకారణస్వరూపము, సూక్ష్మశరీరసృష్టిప్రకారము, జీవబ్రహైక్యవిచారము, ఓంకారస్వరూప నిరూపణము, పంచకోశవివేచనము, దృగ్దృశ్యవివేకము, ఆరురుక్ష్వాదిలక్ష ణము, సద్రూపలక్షణము, ప్రళయనవరణము, చిద్రూపలక్షణాఖండలక్ష ణాదులను సహేతుకముగ నిరూపించి సాంఖ్యయోగమును బూ ర్తిసేసెను.

ఇఁక మూఁడవయాశ్వాసమున, అమనస్కయోగలక్షణము, తద్వ ర్తనము, వైరాగ్యబోధోపరతుల తారతమ్యము, వైరాగ్యశబ్దవిమర్శనము , గురుశుశ్రూషావిచారము, మహావాక్యార్థవివరణము, సుస్థితప్రజ్ఞలక్షణము, పంచదశయోగాంగవిభాగము, యోగిలక్షణము మున్నగువానిని సాంగ ముగ వివరించి యమనస్కయోగమును ముగించెను. ఈమూఁడుయోగ ములును రాజయోగభేదములే కావున నీగ్రంథము రాజయోగ నిరూపక మనందగియున్నది.