పుట:సీతారామాంజనేయ సంవాదము.pdf/12

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పీఠిక.

___________

మాతృభాషయందుఁ బ్రౌఢములై పండితైకవేద్యములై వాదా నువాదప్రతివాదభూయిష్టములై శాస్త్రజ్ఞానము లేనివారలకు దురవగా హము లైనద్వైతాద్వైతవిశిష్టాద్వైతసంబంధము లగువేదాంతగ్రంథి ము లనేకములు గలవు; గాని యందఱకుఁ దేటతెల్ల మగుదేశభాష యందు సామాన్యు లగు వేదాంతజిజ్ఞాసువులకు సులభముగ సిద్ధాస్త స్వరూపమును దెలుపు వేదాంతగ్రంథములుమాత్రము మిక్కిలి తక్కువగ నున్నవి. ఇట్టికొఱత యన్ని మతముల వారికిఁ గలవని చెప్పుట సాహసము గాదు గాని చాలవఱకు విశిష్టాద్వైతులకు మాత్రమీకొఱఁత దీర్పఁబడి నది. ఏలయన సుమారు 5000 సంవత్సరములకు ముందునుండియే భూత యోగి మహాయోగి సరోయోగి శఠకోపాదులగువిశిష్టాద్వైతులు తమ సిద్ధాంతమును ద్రావిడ భాషలోనికిఁ బద్యరూపముగ మార్ప నారంభించిరి. తరువాతను వారిమతము ననుసరించియే లోకాచార్యాదులు తత్త్వత్ర యతత్త్వశేఖరాదిగ్రంథములఁబెక్కింటిని వచనరూపముగ నెల్లరకుఁ దేట తెల్లమగునట్లు రచించిరి. ఇంతియకాక, క్రీ.శ. 16 శతాబ్దము లో నుండు కృష్ణదేవరాయలు, సంకుసాలనరసింహకవి మున్నగువారు తమవిష్ణుచిత్త యకవికర్ణరసాయనాది గ్రంథములయం దీమతస్వరూపమును జక్కఁగ వివ రించి యాంధ్ర భాషయందును విశిష్టాద్వైత సిద్ధాంతమును వెలయించిరి. తరువాతివారును ముముక్షుజనకల్పకము మున్నగు కొన్నిపద్యకావ్యము లను రచించిరి. పిదప నూఱుసంవత్సరములనుండి యఱవమునుండి తెలుఁ గున కెల్లగ్రంథములు మార్చుకొనఁబడుచున్నవి గదా !

ఇట్లె కొంతవఱకు ద్వైత గ్రంథములుగూడఁ గర్ణాటభాషలోనికి మార్చుకొనఁబడినవట! కాని యల్పవ్యాప్తి గల యామతగ్రంథము లంతఁగా బ్రసిద్ధి నొందినవి గావు.