పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/89

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మెచ్చుగా నిచ్చిన మెయికొని ప్రణమిల్లి
దేవేంద్రు వీడ్కొని తేరిమీఁద
నిడికొని యుజ్జెని కేతెంచి వేడ్క సిం
హాసనం బెక్కి యా యవనివిభుఁడు[1]
ఆ. సిద్ధు లెనిమిదియును జేకూరఁ బగతుర
పే రడంచి యాజ్ఞ పెంపుమీఱ
నేకవీరుఁడై యనేకవర్షంబులు
ధరణి యేలెఁ బుణ్యచరితుఁ డగుచు. 137

శా. సత్పాత్రప్రతిపాదితార్థుఁ డయి రాజ్యం బుర్విలో సర్వసం
పత్పూర్ణంబుగఁ జేయుచుం బ్రజల భూపాలుండు పాలింపఁగాఁ
దత్పూర్వార్జితపుణ్యభోగముల కుత్సార్యత్వసంపాదులై
యుత్పాతంబులు వుట్టె నుజ్జయినిలో నుల్కాదిలక్ష్యంబులై. 138

క. అట్టివి గని జనపాలుడు
భట్టిం బిలిపించి నీవు భావజ్ఞుఁడ వీ
పట్టున నేతెఱఁ గగునో
యట్టి తెఱం గెఱుంగు మనిన నతఁ డిట్లనియెన్. 140

ఆ. పడగ నేలఁ గూలెఁ బట్టపేనుఁగు వ్రాలె
మేడఁ గాకికదుపు గూడి యఱచె
నిన్న వారువముల కన్నుల నీరోల్కె
దీన నీకుఁ గీడు తెల్ల మింక. 140

క. ఇది నిజ మనవుడు నతఁ డే
కదినాధికవర్షయైన కన్యకు సుతుఁడై

  1. నిడికొని యుజ్జయినికిఁ దెచ్చి యొకవేళ నమ్మహాసన మెక్కి యవనివిభుఁడు