పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/88

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వ. ఇట్లు రంభ యాడినం జూచి యానాకలోక భూలోకనాయకులు మఱునాఁ డూర్వశి కవసరం బిచ్చిన నదియును సంగీతశాస్త్రానుసారంబుగా[1] నిలిచి
విలక్షించుచు— 132

క. తనువున గీతాలంబన
మును జేతుల నర్థవ్యుషితమును నేత్రయుగం
బున భావముఁ బదములఁ దా
శనిర్ణయమ్మును మెఱయఁగ లాస్యము నెఱపెన్. 133

క. సురకామిని తన నయనము
లరుదుగఁ దలచుట్టివచ్చు ననుట నిజముగాఁ
దిరుగుచుఁ బరిమండలితాం
బరపల్లవయై నటించె మరుగొడుగుక్రియన్. 134

క. ఈక్రియ నూర్వశి యాడిన
విక్రమఘనుఁ డిదియె మఱియు వెరవరి యనినన్
శక్రుడు మర్మము దెలుపుమ
యేక్రమమున దీని నిర్ణయించితి వనినన్. 135

ఉ. నావుడు నాతఁ డిద్దఱును నాట్యమున న్సరివత్తు రిందు శా
స్త్రావగతప్రసంగముల సాంగముగా నిది యాడె గాన ని
ట్లే వివరించి యూర్వశియ యెక్కడుగాఁ గయికొంటి నన్న న
ద్దేవుఁడు మెచ్చి యాతనికి దివ్యవిభూషణ మిచ్చి వెండియున్. 136

సీ. ప్రభల నుప్పొంగు ముప్పది రెండు బొ
మ్మలు నన్ని వాకిళ్ళుఁ బెంపడరుచున్న
నవరత్నఖచితమై వివిధసోపానమై
భాసురంబైన సింహాసనంబు

  1. సంగీతప్రసంగానుసారంబుగా