పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/81

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

క. ఉల్లమునఁ గనలి ధరణీ
వల్లభుఁడుం దానిఁ బిల్చి వనితా యిది నీ
యి ల్లేవెరవునఁ జేరెను
గల్లాడక చెప్పు [1]తప్పుఁ గాచితి ననియెన్. 96

మ. అనినం జెప్పక తీర దంచు నది నెయ్యం బొప్ప నాగోపుఁ జె
ప్పినఁ దన్మూలమునం గ్రమక్రమమునం బృథ్వీశ్వరుం డంతయు
న్విని దండింపక యాత్మ రోసి పలికె న్వేయింపుల న్సొంపులం
దనియంజేసిన నిల్చునే వనితచిత్తం బంచు నిందించుచున్. 97

ఆ. కప్పురంపుఁగుదుటఁ గస్తూరి యెరువుతో
నుల్లి నాటి చందనోదకములఁ
బెంపిరేని దాని కంపుమాయని భంగి
నెంతయైన నిలువ దింతిమనము. 98

క. వనిత యొరుఁ జూచి లోనగు
నన నిక్కము పతియు దోడియతివలుఁ బరులుం
గని విని యెగ్గొనరించెద
రని మానిన మానుఁగాక యద్దము గలదే. 99

సీ. మద మెక్కుచన్నులు మాంసపుముద్దలు
హేమకుంభములకు నెక్కు డనుచు
దూషితమూత్రపురీషదుర్గంధ మౌ
జఘనంబు కరిశిరస్సదృశ మనుచు
జిలిబికిం బుసులకుఁ జీమిడికిని బుట్ట
యైన మొగంబు సుధాంశుఁ డనుచు

  1. నిన్ను గొడితే