పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/79

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

    ఱడి యమరత్వం బేటికి
    గడు పిటఁ గాలంగఁ గంటఁ గాటుక యేలా. 86

క. గతి దప్పిన పని కేమని
   పతి దూఱఁగవచ్చు నిట్టి ఫలమున నొక సం
   గతి ధనము పడయవచ్చును,
   మతిలో స్త్రీబుద్ధియనక మన్నింపఁదగున్. 87

మ. ధరణీకాంతునకైన నొప్పు నమరత్వం బింక నీవేగి యా
    నరనాథుం గని దీని నిచ్చి బహురత్నస్వర్ణనిష్కోజ్జ్వలాం
    బరభూషాది సువస్తువు ల్వడసి రమ్మా యంచుఁ బొమ్మన్న భూ
    సురుఁ డేగెన్ ఫలహస్తుఁ డయ్యును [1]విహస్తుం డై నృపాస్థానికిన్. 88

శా. ఆవేళన్ రమణీమణు ల్గొలువఁగా నాస్థానభూమి న్ముఖ
    శ్రీ వెంపారఁగ నున్న భర్తృహరిధాత్రీనాయకుం గాంచి భూ
    దేవుం డుత్సవ మంది యాదరముతో దీవించి యాపండు స
    ద్భావం బొప్పఁగ నిచ్చి చెప్పె వరుసం దత్ప్రాప్తిసత్వంబులన్. 89

చ. బహుజనరక్షకుండ వగుపార్థివ నీక తగు న్ఫలం బను
    గ్రహమునఁ బుచ్చుకొ మ్మనినఁ గైకొని భూపతి వేడ్కతో యశో
    మహిమకుఁ బేరుగాఁ బసిఁడిమాడలుఁ బేర్చినపట్టుచీరలు
    న్మహితములైన రత్నములు మన్నన నాతని కిచ్చి పుచ్చి తాన్. 90

క. నే నుండఁగ నిది సచ్చిన
    నే నుండుట గడిఁది యిట్టినెలఁతుక గలుగ
    న్నే నున్న నొప్పు నని తన
    చేనున్న ఫలం బనంగసేనకు నిచ్చెన్. 91

  1. *విహస్తుఁడు = చేయి లేనివాఁడు,
        వ్యాకులుఁడు