పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/68

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రథమాశ్వాసము

7

చ. తెనుఁగున దేటగాఁ గథలు దెల్పినఁ గావ్యము పొందు లేదు మె
    త్తన పస చాల దండ్రు విశదంబుగ సంసృతశబ్ద మూఁదఁ జె
    ప్పిన నవి దర్భముండ్లనుచుఁ బెట్టరు వీనులఁ గావునన్ రుచుల్
    దనరఁ దెనుంగుదేశియును దద్భవముం గలయంగఁ జెప్పెదన్. 32

క. పదిలముగ మృదులవచనా
   స్పదపదసంపదల రసము పదనిడక మహా
   పదముల నైనను జల్లులఁ
   బొదుపెట్టిన దుడుకుఁగవిత[1] పొదలునెసభలన్. 33

ఆ. తనవచోనిశేష మెనయక పూర్వక
   థామితోక్తిఁ జెప్పు టేమికడిఁది
   యొకఁడు గోలవట్టి యొయ్యనఁ గొనిపోవ
   నంధుఁ డెచటికైన నరుగు టరుదె. 34

ఉ. ఈసరసోక్తికావ్య మొకఁ డిమ్ముల సంస్కృతభాష నచ్చుగాఁ
    జేసిన నట్ల వీఁడు మఱి చేయుట యేటిది యంచుఁ జెప్పఁగాఁ
    జేసి యనాదరం బురక చేయకుఁడీ విలుకాఁడు తూఁటుగా
    నేసిన నందె పాఱ మఱి యేసినవానిద సూటిగావునన్. 35

చ. తెలుఁగున కెల్లఁ దల్లి యగుఁ దెల్లము సంస్కృతభాష యందులోఁ
    బలుకు లెఱుంగుచోఁ బదవిభాగము నన్వయ మర్థమంచు నీ
    మలకలకంటె నందుల సమర్మము దేటతెనుంగ యొప్పు నా
    కొలఁది ప్రియంబు గాదె చెఱకు ల్దినుకంటె రసంబు గ్రోలినన్. 36

క. పురమధుజలలీలాంబుధి
   పరిణయనయవిప్రలంభ పతిగుణసుత భా


  1. దుండుకవిత