పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/58

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

8)

lvii

ఈ సీసములోని ఎనిమిది పాదములు గీతములోని నాలుగు పాదముల మొదటి అక్షరములను కలిపి చదివినచో “రాజ దీని వివాహము చేయవయ్యా" అని ఆగును. ధారాశుద్దిగల ఈతని కవిత్వము పఠితలకు చవులూరించును.

కృతి సమర్పణము :

గోపరాజు హరిహరాభేదమును పాటించు అద్వైతి. తన కావ్యమును హరునకు, హరికి సమర్పించెను. ఇతనికి పూర్వము తిక్కనాదులును తమ కృతులను హరిహరనాథునకు సమర్పించిరి. ఇతడు హరిహరులను వేరుగా, ఏకరూపునిగ స్తుతించెను. కావ్యారంభమున శివుని, ఆ తరువాత కేశవుని నుతించెను. అవతారికలో “సింహాసన ద్వాత్రింశతి కథా కథనమూలకారణం బైన అంబికారమణుండును, మత్కవితాసంపత్తి సంధాయకుండగు లక్ష్మీనాయకుండును గావ్యనాయకులుగా నియమించుటం జేసి,

సీ. పాపపెండెము గాక పసిఁడి యందియయును
         నడుగుఁదామరపైన నమరువాఁడు
    పెద్దమెకముతోలు నిద్దంపుఁ బట్టును
         మొలదిండుగాఁ గట్టి మురియువాఁడు
    ఎముకపూసలును ముత్యములు జేరులు గాఁగ
         నక్కునఁ దాల్చి పెంపెక్కువాఁడు
    పునుకయుం బెనుగుల్లయును గేలు దమ్ముల
         నంచల మాడ్కిఁ బాటించువాఁడు

    సగము పొడవునఁదెల్పు నా సగము నల్పు
    నయ్యు మెడ నొక్క వన్నియ యగుచు మేను
    లెనయ ముక్కంటియును వెన్నుఁడును ననంగఁ
    బొల్చు నా వేల్పు కబ్బంబుఁ బ్రోచుఁగాత. (1-40)

అని హరిహరనాథునకు సమర్పించెను. ప్రాచీన కవులందరును తమకృతి భర్తలను, కావ్యారంభమునను, షష్ఠ్యంతములలోను, ఆశ్వాస ఆద్యంత