పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/550

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వాదశాశ్వాసము 489


యీకలియుగపర్యంతం
బీకథలు ప్రసిద్ధి కెక్కు నిట నీకరుణన్.

113


మ.

[1]అని యీరీతి నుమామహేశులకు సాంద్రానందసంధానమై
విననింపై కవిసమ్మతప్రకృత మై విద్యన్మనఃసద్మజీ
వన మై పావన మై మహాసనకథాద్వాత్రింశి కర్ణామృతం
బన నెల్లప్పుడుఁ జెల్లుఁగాత భువిలో నాచంద్రతారార్క మై.

114


శా.

అంభోరాశిజలప్రపూర్ణవిహృతివ్యాసక్తచిత్తాంబుజుం
గుంభసంభవముఖ్యసర్వమునివాగ్గుంభస్తుతారంభునిన్
జంభారాతిసమీహితాయనమహాస్తంభాంతసంభూత సం
రంభాటోపవిదారితారివరుఁ బ్రహ్లాదప్రతిష్టాపరున్.

115


శా.

బాణాగారముఖాభిరక్షణగుణప్రారబ్ధు యుద్ధక్రియా
క్షీణోపేంద్రసుహృత్వకృత్యుని దృఢాంగీకారసన్మౌనిగీ
ర్వాణాధీశసమర్చితాంఘ్రియుగళు న్వామాంగవిన్యస్తశ
ర్వాణీమగ్నమనోంబుజుం [2]ద్రిభువనావష్టంభునిన్ శంభునిన్.

118


మాలిని.

నవహిమకరజూటా నందితామర్త్యకూటా
జవనవృషభవాహా శంఖచక్రాంకదేహా
ధవళనిజశరీరా దానవధ్వంసకారా
శివమురరిపురూపా శిష్టదృష్టస్వరూపా.

117


గద్యము.

ఇది రాయగజగంధవారణ వైరిమండలికభేకఫణీంద్ర వీరఘోట్టవిభాళ కళింగదేశనిర్దూమధామ త్యాగనాగార్జున కర్ణాటద్రవిళాంధ్రమహారాష్ట్రభూపాలరూపనూపురసుందరచరణారవింద సనదప్రోలిపురవ

  1. అనుచుంబ్రార్థనచేసెఁ గావున నరేంద్రానందసంధానమై
  2. ద్రిభువనవ్యాపారపారీణునిన్