పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/549

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

488

సింహాసన ద్వాత్రింశిక


క.

పర్యాప్తంబుగఁ గథ లీ
మర్యాద న్విన్నయట్టి మానవునకు నౌ
ధార్యంబును దెగువయు గాం
భీర్యమ్మును బ్రియము నయముఁ బెంపు వహించున్.

108


మ.

అని దీవించి యుమాసఖీజనులు దివ్యాకారసంపత్తి సౌం
పున నాకాశమున న్మెఱుంగులక్రియం బొల్పారునుల్లాససం
జనితప్రౌఢచోవిలాసముల నాశ్చర్యంబు రెట్టింప నా
జనులెల్లం దముఁ జూడఁగాఁ జనిరి భోజశ్రేష్ఠు నగ్గించుచున్.

109


శా.

భోజేంద్రుండును నెక్కరామి హృదయాంభోజంబులోఁ గాంచి ని
ర్వాణం బై విలసిల్లు యత్నమున విద్వత్సన్నిధిన్ దానిపై
దేజోమూర్తిఁ ద్రిలోకవంద్యుని [1]మహాదేవున్ శివు న్నిల్పి త
త్పూజాలబ్ధవరప్రసాదమహిమన్ భూమండలం బేలగన్.

110


శా.

సద్యోనిర్ణయవాదులు న్సరసులు [2]న్సంగీతకావ్యక్రియా
విద్యావంతు లనంతశిల్పరచనావిజ్ఞానులు న్సర్వసం
పద్యోగప్రథమానకీర్తియుతులు న్ఫామామనోరంజనా
హృద్యాకారులుఁ బుణ్యవర్తనులు నై యేపారి రుర్వీజనుల్.

111


మ.

అనుచుం జెప్పిన నద్రిజాత మిగులన్ హర్షించి యోదేవ యే
నును బూర్వంబునఁ గొంత వింటిఁ బిదప న్నూత్నప్రసంగంబున
న్విననింపౌగతి నేఁడు విస్తరముగా వింటి న్మహావీరుఁ డా
తనిసామర్థ్యము నీప్రసాదమునఁ జిత్రం బయ్యె మృత్యుంజయా.

112


క.

[3]నాకోరిన కథలెల్లను
నేకతమునఁ దెలియ నానతిచ్చితి దేవా

  1. మహాదేవు న్నను న్నిల్పి, మహాదేవుం దగ న్నిల్పి
  2. సంగీతవాద్యక్రియా
  3. నాకోరినకొలఁదినియీ