పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/547

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

486

సింహాసన ద్వాత్రింశిక


త్తమనాయకు గుణకథనార్థమై ని న్నిన్నిమాఱులు వారించితిమి. నాపేరు శృంగారతిలక యనం బరఁగు, వీరలు జయయును, విజయయు, మలయావతియు, ననంగసంజీవనియును, గంధర్వసేనయుఁ, బ్రభావతియు, సుప్రభయు, సంభోగనిధియు, సుభద్రయు, జంద్రికయు, గురంగనయనయు, ననంగధ్వజయు, నిందువదనయు, విలాసరసికయుఁ, గోమలియు, సౌందర్యవతియు, లావణ్యవతియు, లజ్జావతియు, నిందుమతియు, జనమోహినియును, విద్యాధరియు, హరిమధ్యయు, సుఖప్రదాయినియుఁ, బ్రబోధవతియు, మలయవతియు, హంసగమనయు, నంగసుందరియు, సుకేశియుఁ, జతురికయు, వామాంగియుఁ, దలోదరియు, [1]నను పేరులు గలవారని యెఱుంగు మిట్టి మేమును.

100


క.

బొమ్మల మై యామణిపీ
ఠమ్మున బహుకాలముండి డస్సితి మని చి
త్తమ్ములఁ బొగులఁగ మాభా
గ్యమ్మున నీతోడ మాట లాడంగలిగెన్.

101


క.

కష్టంబు వీడె నీకే
యిష్టం బది వేఁడు మిప్పు డిచ్చెద మనినన్
సాష్టాంగ మెరఁగి భోజుఁడు
హృష్టుండై పలికె వారిహృదయము లలరన్.

102


క.

మీకృప సంపద లన్నియు
నా కుండగ నేమి ప్రార్థనము భవదీయా
లోకము గలిగెను బుణ్య
శ్లోకుఁడ నై యుండఁ గంటి లోకులు వొగడన్.

103
  1. మనోహరియు, మానవతియు, పద్మపాణియు, నీలవేణియు, శుకవాణియు, పులినశ్రోణియు, నిరుపమయు నను పేరులు ప్రత్యంతరములలో నున్నవి. వీనింజేర్చిన 32 నకు మించినవి.