పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/544

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వాదశాశ్వాసము

483


క.

ఈపాటి మహిమ గుణములు
నీపాలం గలిగెనేని నేఁ డెక్కు వృథా
టోపంబులు వలదని యో
క్ష్మాపాలక నిన్ను మాన్పఁ జలమో ఫలమో.

85


క.

అని చెప్పి మఱియు నాతని
మన మలరఁగఁ బలికె నిన్నిమాటులు మానే
ర్పున నతనిమహిమ కొలఁది
[1]న్వినిపించితి మింతెకాక నీ వల్పుఁడవా.

86


క.

నరనారాయణు లనఁగాఁ
బరఁగెడు హరిమూర్తు లుర్వి ఫల్గున దామో
దరులై పుట్టిరి నాఁ డా
నరుఁ డతఁడై పుట్టినాఁడు నరవరతిలకా.

87


క.

ఈకలియుగమున విద్యల
కేకడఁ జేపట్టు లేమి యెఱిఁగి పలికి వా
ణీకామిని వినిపించిన
నాకమలభవుండు సెప్పె నచ్యుతుతోడన్.

88


ఆ.

[2]అచ్యుతుండు విద్యలైశ్వర్యమునఁగాని
మెఱయవనుచుఁజెప్పి యెఱుక గలుగ
నరునిఁ బుట్టఁ బంచె నరపతిత్వము గోరి
యతఁడు నవని నీవయై జనించె.

89


క.

నరునకు నారాయణునకు
నరయఁగ భేదంబు లేదు హరి యొక్కడు న

  1. వినిపించిన నింతనేమి
  2. అచ్యుతుండ విద్యలైశ్వర్యమునఁగాని
    మెఱయవనుచుఁ జెప్పి యెఱుక గలిగి
    యవని బుట్టఁ బంచె నాహరి యిపుడు నీ
    వై జనించినాఁడ వవనిపాల.