పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/541

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

480

సింహాసన ద్వాత్రింశిక


చ.

అనవుడు నట్ల యియ్యకొని యాతని మూఁపునఁ బెట్టుకొంచు దె
చ్చిన మది మెచ్చి వాఁడు మునుసెప్పినరీతిని మ్రొక్కుమన్న నే
గనిక్రియఁ బల్కిన న్మఱి ధరం బ్రణమిల్లిన వానిమస్తకం
బనువునఁ ద్రెంచి పావకున కాహుతిగా నొనరించి సిద్ధుఁ డై.

70


ఆ.

ఆత్మరక్షణాఢ్యుఁ డగువాని నటు వేల్చు
నంత భూతనాథుఁ డతని మెచ్చి
యెప్పుడైనఁ దలఁపు మేవచ్చి నిల్చెద
సిద్ధు లెనిమిదియును జెందుననియె.

71


క.

సుర లటు పేర్కొని విద్యా
ధరరాజ్యము గలుగ నొసఁగి తద్గుణముల క
చ్చెరు వందుచు నేగిరి భూ
వరుఁడును బేతాళు ననిపి వచ్చెం బురికిన్.[1]

72


శా.

ఈ సామర్థ్యము నేర్పుఁ దెంపు నణిమాధీశత్వము న్లేక నీ
కీసింహాసన మెక్కు టౌనె మదిలో నీక్షింపుమా యన్న ను
ల్లాసం బెల్లఁ దొఱంగి తద్గుణగణశ్లాఘాపరుం డౌచు ల
జ్జాసంగవ్యథఁ గ్రమ్మఱం జనియె భోజుక్ష్మావిభుం డింటికిన్.

73

ముప్పది రెండవ బొమ్మకథ

క.

తదనంతరంబ యాము
ప్పదిరెండవబొమ్మయైనఁ బద మిడు తరి స
మ్మదమున నిఁకఁ బల్కెడునని
మదిలోపలఁ దలఁచి యతడు మఱునాఁ డెలమిన్.

74
  1. ఈకందమునకు మాఱుగా, వ. అనిన నట్ల విక్రమార్కుడు సంకల్పసిద్ధుండయ్యెఁ గావున- అని యొక ప్రతిలోఁ గలదు.