పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/540

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వాదశాశ్వాసము

479


బున నిలువక యెగసి రయం
బునఁ జని తరుశాఖఁ దగిలెఁ బూర్వస్థితితోన్.

63


వ.

ఇట్లు విడిపించుకొని పోయిన.

64


క.

ఆనరపతి క్రమ్మఱఁ జని
పీనుఁగు క్రియ వీపుమీఁదఁ బెట్టుకొని చనం
గా నొకకథనెపమున న
మ్మౌనము విడిపించి యతఁడు మగుడం బాఱెన్.

65


వ.

ఇట్లు మొదలికథంబోలె సారిసారెకుం గథలు చెప్పి మఱుఁగులైన సదుత్తరంబు లందుచుం బరికించుచు నిరువదియేనుమాఱులుదాఁక రాకపోకల నలయించి యతనివివేకంబునకు స్థిరోద్యోగంబునకుం బరిణమించి బేతాళుండు మే లొనగూర్పం దలంచి.

66


క.

నరనాథ సర్వలక్షణ
పరిపూర్ణుఁడ వంచు నిన్ను బలిసేయ మదిం
బరికించి కపటభిక్షుకుఁ
డరుదుగ ననుఁ దోడితేర ననుపుట గంటే.

67


ఆ.

నన్నుఁ గొంచు నేగ నిన్నును సాష్టాంగ
మెఱుఁగు మనిన మ్రొక్క నెఱుఁగఁ దొల్లి
నేడు నిన్ను జూచి నేర్చెద నిప్పుడు
మ్రొక్కి చూపు మనుము మోసపోక.

68


క.

ఇటు మ్రొక్కు మనుచుఁ జాఁగినఁ
దటుకున నడిదమున వానితల ద్రెంచి సము
త్కట మగు ననలములో నొ
క్కట వైవుము సిద్ధులెల్ల [1]గతిపడు నీకున్.

69
  1. గనఁబడు