పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/534

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వాదశాశ్వాసము

473


నది తొంటిక్రియ మాటలాడఁగాఁ గుంకుమ
        నూఱెడి సఖిఁ బిల్చి నోరిమీఁద


ఆ.

దీని నడువు మనుచుఁదెగి మూఁడువ్రేళ్ళు వ్రే
యించి వెడలనడిచె వంచనమున
మగిడివచ్చి కుంకుమద్రవాంకితము లౌ
పెట్లు సూపె నది యభీష్టమమర.

36


గీ.

చూచి యాస లేమిఁ [1]జూకురుఁబొందుచు
చచ్చుటొప్పు ననుచు వెచ్చనూర్చు
వజ్రముకుటుఁ బొగల వల దని తత్సఖుఁ
డాస గలుగఁ దెలిపి దాసిఁ బిలిచి.

37


వ.

ఆకన్నియ రజస్వల యై యుండంబోలుఁ గావున నెఱ్ఱగా నీమూఁడువ్రేట్లు వేయించి త్రోలించె నీమూఁడుదినంబులుం గడపి యింక నొక్కతోయంబె యరుగవలయు నని వేఁడుకొనిన నదియుం గ్రమంబున నాలుగవనాఁడు కన్యకాసౌధంబునకుం జని మగిడి వచ్చి.

38


మ.

నగుమో మొప్పఁగ నేఁటిమాట వినుచు న్న న్నాదరింపంగ నే
నుఁగు తద్వేళ మదించి కంబము వెస న్నుగ్గాడి యేతెంచిన
న్మొగసాల న్వెడలంగరా దనుచు నంభోజాక్షి పీఠంబుపై
డిగజాఱ న్ననుఁ ద్రాటఁ గట్టి విడిచెన్ డెందంబు బిట్టుల్కఁగాన్.

39


క.

అనవుడు తన్మార్గంబునఁ
జనుదెమ్మను టయ్యె ననుచు జనపతిసుతునిం
గొనిచని యాపీఠముపై
ననిపె నతని మీఁదివార లటు చేఁదుకొనన్.

40
  1. స్రుక్కుచుఁ బొక్కుచు