పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/533

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

472

సింహాసన ద్వాత్రింశిక


తన్మంత్రివర్యుండు దంతఘట్టకుఁడు త
        త్తనయ పద్మావతి యనఁగఁ గలదు
దానికి నే నిష్టదాసినై వర్తింతు
        నని యది చెప్పిన నాత్మఁ బొంగి


ఆ.

మంత్రిపుత్రుఁడు తనమాట నిక్కువమైన
నతని నూఱడించి యదియ యటకు
దూతిగాఁగ మొదలు దొరకొని తమరాక
చెప్పిపుచ్చి రపుడు చెలియకడకు.

33


క.

అది చని యొక రాకొమరుఁడు
సుదతీ నీతలఁ పెఱింగి [1]సుగుణత యొందం
గదియఁ జనుదెంచి సమ్మద
మొదవఁగ నాయింట విడిసియున్నాఁ డనినన్.

34


వ.

అది విని గూఢభావం బేర్పడకుండ దానిని భర్జించి రోషమిషంబునం గర్పూరమలయజసాంద్రంబు లగు రెండుచేతుల దాని రెండుచెక్కులం దనపదివ్రేళ్ళు నంటవేసిన నది ఖిన్నవదనయై తిరిగి చనుదెంచి తత్కృతావమానంబు సూపిన నారాకొమరుం డింక నాశ లేదని యుస్సురనినం దత్సహచరుం డగు బుద్ధిశరీరుం డట్లనియె.

35


సీ.

చింతింప కిఁక దీని చెక్కిళ్ళఁ దెల్లని
        పదిరేఖలుగ వ్రేసి పంపు టరయ
నిదిశుక్లపక్ష మీపదిదినంబులుఁ బుచ్చి
        రమ్మని చెప్పుట నమ్ము మనుచుఁ
దెలిపి యాపదిదినంబులుఁ బుచ్చి యాదాసి
        బ్రార్థించి యెప్పటియట్ల ననుప

  1. సుందర మొదవన్; సుగుణతనమునన్