పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/531

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

470

సింహాసన ద్వాత్రింశిక


క.

ఆదంపతులకు సుతుఁడు ప్ర
మోదాకృతిఁ బుట్టి వజ్రముకుటుఁ డనంగా
మేదినిఁ బరఁగుచునెన్నఁగ
శ్రీదనరారంగ మరుని చెలువు వహించెన్.

24


క.

ఆరాజసుతుఁడు బుద్ధిశ
రీరుం డనుమంత్రిసుతుఁడు ప్రియసఖుఁడుగ నా
నారూపవినోదముల వి
హారంబులు సలుపుచు న్మహావ్యసనుండై.

25


ఉ.

ఇష్టసఖుండుఁ దా నడవికేగి మృగంబుల వేఁటలాడుచుం
గ్లిష్టశరీరుఁడై కొలని క్రేవ జలార్థము చేరి కన్యకా
సృష్టికి నాద్యలో యనెడు చెల్వలు [1]గొల్వఁగఁ దారకాంతర
స్పష్టహిమాంశురేఖ కిది సాటి యనం బొడఁగాంచె నొక్కతెన్.

26


చ.

అనువుగ బాహులోచనకుచాస్యకళ ల్గొనివచ్చినారు తెం
డని బిసమీనచక్రనలినౌఘము నీళ్ళను ముంచి వచ్చి శో
ధన మొనరించి చేకొను విధంబున నంబురుహాకరంబు పొం
[2]తను విహరించు బాలికయు ధారుణినాథుతనూజుఁ జూచినన్.

27


క.

ఇరువుర చూపుల మదనుఁడు
శరములుగాఁ జేసి పులకసముదయ మొదవన్
సరి నయ్యరువురమనములఁ
గరఁగించెం బ్రేమరసము గడలుకొనంగన్.

28


ఉ.

అంబురుహాక్షి యప్పుడు ప్రియంబున నౌఁదల గల్వపూవుఁ గ
ర్ణంబునఁ జేర్చి, దంతశిఖరంబుల ఘట్టన చేసి, పాదప

  1. గొల్వగ నొప్పుచుం గళా
    స్పష్టహిమాంశురేఖ కిది సాటి యనందగు కొమ్మఁ గన్గొనెన్.
  2. త నిలిచియున్న బాలకియు