పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/528

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వాదశాశ్వాసము

467


బిలిపించి యిన్నాళ్ళఫలములు దెమ్మన్న
        నరిగి మాణిక్యంబు లైనవాని
నన్నిటిఁ దెచ్చిన [1]నాదాఁపుటకు మెచ్చి
        వానికి నవి యిచ్చి వరుసఁ బిదప
క్షాంతిశీలుం డటు చనుదెంచుటయుఁ జూచి
        యనఘ నీవిట్టి యనర్ఘమణులు


ఆ.

నాకు నిచ్చి యేమి నాయెడఁ గైకొనఁ
దలఁచినాఁడ విపుడు విలువఁ జూడ
నొక్కరత్నమునకు నుర్వియంతయుఁ జాలు
దిన్నిరత్నములకు నెద్ది యిత్తు.

11


క.

అనవుఁడు నాభిక్షకుఁ డో
జననాయక దీనికంటె సమధికగుణమౌ
పనిగలదు గాన వచ్చితి
ననఘుఁడ వభయుఁడవు సాహసాంకుఁడ వగుటన్.

12


చ.

క్షితివర నాప్రియంబు విను కృష్ణచతుర్దశినాఁటిరాత్రి యు
న్నత మగు మఱ్ఱిక్రింద మసనంబున నున్న పిశాచపంక్తి స
న్నుతు లొనరించి హోమము మనోరథసిద్ధికిఁ జేయువాఁడ నే
కతమున నీవు నచ్చటికిఁ గ్రక్కున రమ్మటు నాకుఁ దోడ్పడన్.

13


చ.

అనవుడు నింతకాలము ప్రయాస మిదేటికి నాఁడె చెప్పినం
బనివిననే యడంచి యొక బ్రహ్మముఁ జేసితి నేఁడు నీవు చె
ప్పిన సమయంబు దప్పక యభీష్టము నీ కొనగూర్ప వచ్చెదం
జనుమని వీడుకొల్పి నృపచంద్రుఁడు మానస ముత్సహింపఁగన్.

14


వ.

అంతఁ గృష్ణచతుర్దశి వచ్చినం దద్రాత్రి సమయంబున.

15
  1. నాడాఁపురమునకు మెచ్చినదానికి నవియిచ్చి, పిదప