పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/524

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఏకాదశాశ్వాసము

463


సీ.

ఆమంత్రివరులు సాష్టాంగంబుగా మ్రొక్కి
        నిలిచి ముందరఁ గరంబులు మొగిడ్బి
జనలోకనాయక యెనిమిదికోట్లు దీ
        నారముల్ [1]నూర్వురు వారసతులు
తొంబదిమూఁడు ముత్యంబుల[2]కావళ్ళు
        నేఁబది మత్తకరీంద్రములును
మున్నూఱు జవనాశ్వములును గప్పంబుగాఁ
        బాండ్యభూపాలుండు పంపె నీకు


ఆ.

నవధరించి దండయాత్ర యక్కడమాని
యతని గావవలయు ననుచు మ్రొక్కి
[3]యున్నఁ గరుణఁ జూచి యుర్వీశ్వరుండును
మోద మడర వారి నాదరించి.

172


ఉ.

అర్థులు గోష్టి [4]చేయు సమయంబున వచ్చిన దర్సనంబు న
య్యర్థుల కిచ్చెనేని ప్రభు వాతఁడె కావున విద్యవాని కా
య్యర్థము ముత్తియంబులు నవాంగనలుం గరులున్ హయంబులుం
బార్థివుఁ డిచ్చి పుచ్చెఁ దను బాండ్యునిమంత్రులు ప్రస్తుతింపఁగన్.

173


క.

అట్టి మహోదారుఁడు తన
పట్టణమున కేగి రాయబారులఁ గృపఁ జే
పట్టి సిరి నెగడెఁ గావున
నిట్టిగుణము లేక యెక్క నితరులతరమే.

174


క.

అనవుడు భోజుండును నె
మ్మనమున నవ్విక్రమార్కు మహనీయము లౌ

  1. యువతులు నూఱువురును
  2. క్రోవలు
  3. విన్నవించుటయును విని యవనీపతి
  4. చేయునెడలందున- చేయునెడ నప్పని