పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/52

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ii


ప్రాంతమున వ్యవహారము నందుండినవి కావచ్చును, శ్రీ వెంపరాల సూర్యనారాయణ శాస్త్రి గారు ప్రథమ ముద్రణ పీఠికలో కొన్నిటిని చూపి ఆర్థములను వ్రాసినారు. అవి గమనింపదగియున్నవి. భానగిలు = బలాత్కృతమగు, కాసించు = కాసెవోయు, వెంచ = మడువు, పాగు = రహస్యము, పరిణయించి = పెండ్లాడి, వెలగ = ధనము, వెట్టము = విరోధి, పరిమాళించుట= మల్లయుద్ధము చేయుట, వయ్యంది= కొలిమి, ఇవికాక మరికొన్ని కలవు. ఉద్దాలు = చెప్పులు, సన్నాలు = పిల్లల మొలనూలు , చక్కదము = మంచిది, పుల్లతి = మల్లయుద్ధ పద్ధతి, ఉబ్బసము = మిక్కిలి సంతోషము.

లోకోక్తులు - సామెతలు :

గోపరాజు సందర్భోచితముగ పలు సామెతలను, లోకోక్తులను వాడెను.

“బాణోచ్చిష్టం జగత్రయం" 1-26

"బ్రహ్మస్వం విషముచ్యతే" 1-176

“కామాంధోపి న పశ్యతి" 1-225

“రాజ్ఞాం ప్రజాపాలనం పరమో ధర్మః" 1-197

“న భూతో న భవిష్యతి" 2-65

“ధనమూల మిదం జగత్" 2-178

"భూయాత్తే సంపద్దీర్ఘాయుర్భవతే" 3-198

"పరోపకారార్థ మిదం శరీరం" 4-34

“మూలం వైరతరోః స్త్రీ" 4-48

"కలౌ మైలారు భైరవా" 4-73

"అనిత్యాని శరీరాణి" 4-141

“ధర్మస్య త్వరితా గతిః" 4-143

“ధర్మే తిష్ఠతి తే బుద్ధిః" 10-11

“బుద్ధిః కర్మానుసారిణీ" 10-148

"నా విష్ణుః పృథివీపతిః" 12-91