పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/516

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఏకాదశాశ్వాసము

455


శా.

[1]ఆవీరుండు వినీతుఁడై మనుజలోకాధీశుతో ని ట్లనున్
దేవాధీశునిబంట నొక్కెడ బలోదీర్ణుండనై తప్పొగిం
గావింపం గని నన్ను హీనపదునిం గాఁజేసిన న్వచ్చినా
[2]నీవామేక్షణ నాదుభార్య యిట నా కిష్టంబుగా వచ్చితిన్.

135


క.

క్రమ్మఱ నింద్రుఁడు రిపుసై
న్యమ్ములు పోరాడ వచ్చునవసర మని యు
ద్ధమ్మునకుఁ దోడుపడ నను
రమ్మని పుత్తెంచె నిపుడు రాజవరేణ్యా.

136


క.

నే నరుగఁగ నక్కడ నా
దానవయుద్ధమున సుదతి దలఁకెడు నిట నే
మానవుఁడు హితుఁడు లేఁ డటు
గాన సతికి నీవె ప్రాపుగాఁ దగు దధిపా.

137


ఆ.

[3]పాలనంబు సేయుప్రభుఁడవు నీకంటె
నొండుచోట నుంచు టురవుగాదు
దిక్కులేనిప్రజకు దిక్కు నీ వటుగానఁ
దరుణి నరసికొమ్ము తండ్రికరణి.

138


క.

అని యప్పగించి సభలో
వినువారలుఁ జూచువారు విస్మయమందన్
హనుమంతునొడ్డనముతో
హనుమంతుని పగిది నెగసె నాకసమునకున్.

139
  1. ఆవీరుఁడు వినతుండై
    భూవరుతో నిట్లు పలికెఁ బొలు పలరంగా
    దేవతలు దానవాదుల
    తో వైరము పూని నన్నుఁ దోడ్పడఁదలఁచిర్.
  2. ఈవామేక్షణ భార్యగా క్షితితలం బిష్టంబుగా వచ్చితిన్
  3. భారమెల్ల మాన్పుప్రభుఁడవు
    నొండుచోటఁగార్య మొండుపుట్టు
    పాపమెల్లమాన్పు-