పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/515

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

454

సింహాసన ద్వాత్రింశిక


నేటి కొక్కవిద్య నే మెఱయించెద
నవసరంబు నాకు నానతిమ్ము.

131


క.

అనుడుఁ దదీయకళాద
ర్శనలాలసుఁ డగుచు నవసరం బిచ్చినఁ గై
కొని నామేళము గూడ్కొని
పనివినియెద నంచు వెడలి పాఠకుఁ డేగెన్.

132


సీ.

అయ్యెడ నొకక్రొత్తయైనమహావీరుఁ
        డందియ డాకాల నమరఁ బూని
బాగుగాఁ బులిగోరు పట్టు దిండుగఁగట్టి
        నునుపార మేనఁ జందన మలంది
తిలకంబు కస్తూరిఁ దిలకించి చొళ్లెంబు
        చెంగులపాగతోఁ జెన్ను మీఱ
హనుమంతు వ్రాసిన యరిగెబిళ్ళయు వాలుఁ
        గరముల జయలక్ష్మి గడలుకొనఁగ


ఆ.

నొకఁడు వచ్చె వెనుక నొక్కబింబాధరి
యంచుదుప్పటిముసుఁ గమరఁబెట్టి
మేనికాంతి కప్పులోనఁ గ్రిక్కిఱియంగ
హంసయానయగుచు నరుగుదేర.

133


క.

[1]వచ్చి నృపుం గని మ్రొక్కిన
నచ్చో నొకమంత్రి యోమహావీరుఁడ నీ
వెచ్చోటనుండి సతితో
నిచ్చటి కరుదెంచినాఁడ వెవ్వఁడ వన్నన్.

134
  1. వచ్చి ప్రణమిల్లి నిల్చిన