పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/51

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

l


ఉదా:- మగఁడు, మనుమఁడు, కయిరఁడు, కత్తళఁడు. మగ, మనుమ, రాయ, పాప, వ్రే, ఱే, ఈ, కా ప్రత్యయాంతంబులు - ఇత్యాదులు, మగాదులు. కయిర, కత్తళ, జన్న, నీల, ఇత్యాదులు కయిరాదులు."

కయిరాదులు తిర్యగ్వాచకములగుటచే అమహత్తులు గావున వానికి 'డుఙ్ఙ' రాదు. అందుకై ఈ సూత్రము చెప్పవలసి వచ్చినది. దీనినిబట్టి పై పద్యమునందలి పదములకు 'డు' ప్రత్యయము వచ్చి సీలఁడు, నడగఁడు, బొల్లఁడు, కత్తలఁడు, కైరఁడు, సారంగఁడు, జారఁడు, జన్నఁడు, నిమవడు అను రూపము లేర్పడును. వాని ద్వితీయావిభక్తి రూపములే పై పద్యమున కానవచ్చునవి. కత్తలఁడు, కత్తలాడు అను రెండు రూపములున్నవి. మహా కవియగు శ్రీనాథుడు తన నైషధములో "కర్తలాణి తేజీహయమున్" అని ప్రయోగించెను. గోపరాజు ఆ ప్రయోగమును చూచి 'కత్తలాని' అని వాడి యున్నాడు.

మరొక పద్యమున

“తేగడైన పెదవి త్రేగుడమృతమని
 కవులు వొగడఁ బేరు గలిగెఁగాక " {1-100)

అని త్రేగుడు ప్రయోగింపబడినది. బాలవ్యాకరణ కృదంత పరిచ్ఛేదమున “గడ చేర్వాదులకగు" అను 15 సూత్రమున త్రేగడ చెప్పబడినది. ఇట్లే ఎన్నియైన జూపవచ్చును.

ఈ కావ్యమున అక్కడక్కడ క్త్వార్థకేకారసంధి వంటి వ్యాకరణ విరుద్ధ ప్రయోగములును కొన్ని కానవచ్చుచున్నవి.

“ఉండిరుదకంబులో మునిగున్న పగిది” (4-102)

“యేకోనవింశతిమద్వారము పొంత బొమ్మపలికెన్"వంటివి ప్రమాద పతితములు కావచ్చును.

అపూర్వపద ప్రయోగములు:

గోపరాజు తన కావ్యమున ఇతరులు వాడని, నిఘంటువులలో సాధారణముగ కనబడని కొన్ని అపూర్వ పదములను వాడినాడు. అవి అతడున్న