పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/506

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఏకాదశాశ్వాసము

445


క.

జనవరుఁ డయ్యుత్సవమున
మన మలరఁగ యాచకులకు మాడలు పదివే
లును దొమ్మిదిలక్షలు గ్ర
క్కున నిచ్చెం గీర్తి దిశలఁ గొనసాగంగన్.

84


వ.

ఆసమయంబున.

85


ఉ.

యాచకకల్పభూజ మగు నానరనాథు మహావదాన్యునిం
జూచితి వానిచేత నిలు చూఱలు గొన్నగతి న్సువస్తువు
ల్నాచతురత్వచిహ్నములునాఁ గయికొంటి నతండు ధాత్రిలో
రాచగొనంబులం బరఁగురా జవుఁ గావున నెన్న నొప్పగున్.

86


ఉ.

అంచు నతండు రత్నపురియందలి మండలనాథచంద్రు వ
ర్ణించిన నయ్యవంతిధరణీధరుఁ డాతని చాగ మాత్మలోఁ
గొంచెమకాఁ దలంచి [1]నిజకోశగృహాధిపుఁ డైన లెంక నీ
క్షించి యనంతదానగుణశీలసమగ్రత [2]నత్యుదారుఁడై.

87


చ.

ఇతని కనర్ఘరత్నములయిండులుఁ గాంచనమందిరంబులుం
జతురతురంగసద్మములు సామజశాలలు నూపురాద్యలం
కృతిసదనంబులు న్వసనగేహములుం బరిపాటిఁజూపు స
మ్మత మగువస్తుజాతము సమస్తమునుం గొనిపోవని మ్మటన్.

88


క.

అనవుఁడు భాండాగారికుఁ
డును విస్మయమందుచుం గడుంబ్రియ మడరం
దనలోన వెఱఁగుపడ నా
కనిఁ దోడ్కొని యరిగి వరుసఁ దగ్గృహములలోన్.

89


వ.

మదశుకానుకృతంబు లగు మరకతంబులును, బరిపుష్పరాగంబు లగు పుష్పరాగంబులును, ధామాధికంబు లగు గోమేధికంబులును, బ్రభాసఫ

  1. నిజకోశగృహస్థితుఁడైన
  2. నత్యుదగ్రుఁడై