పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/505

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

444

సింహాసన ద్వాత్రింశిక


క.

అందు జయసేనుఁ డనఁగఁ బు
రందరవై భవుఁడు [1]రాజరాజధనాఢ్యుం
డిందుధరభక్తినిరతుఁడు
వందిజనప్రియుఁడు మనుజవల్లభుఁ డుండున్.

80


క.

ఆనరనాయకు వేఁడిన
దీనులు ధనవంతు లగుచు దేశములోన
న్మానవనాథులక్రియ నతి
దానంబులఁ బరగుదురు ప్రదాత లనంగన్.

81


సీ.

అట్టివిజయసేనుఁ డధికసంపత్తితో
        నొకనాఁడు నవవసంతోత్సవంబు
సేయ నుద్యోగించె నాయవసరమునఁ
        గవులును బట్లును గాయకులును
నర్తకులును నిజకీర్తి నుతించుచు
        సరసభావంబున సరస నడువఁ
జెలువార వారకాంతలు సుగంధద్రవ్య
        హస్తలై కెలఁకుల నరుగుదేర


ఆ.

దొరలు లెంకలు హితులు మంత్రులును గొలువ
నశ్వరత్నము నెక్కి యుద్యానభూమి
కేగి యచ్చట నొకపొదరింటిక్రేవ
సురుచిరంబుగ మాకందతరువుక్రింద.

82


శా.

అర్పింపందగు పూజలెల్లఁ దగుమర్యాద న్సమర్పించి కం
దర్పుం దత్ప్రియమిత్రుని న్సముచితోత్సాహంబునం గొల్చి యే
కార్పణ్యంబును లేక యిం పెనయఁగాఁ గాశ్మీరకస్తూరికా
కర్పూరాదివసంతఖేలనములుం గావించె నుల్లాసియై.

83
  1. రాజరాజౌదార్యుం