పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/504

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఏకాదశాశ్వాసము

443


ఆ.

తగదు గాని నీయుదారత్వ మేమని
పొగడవచ్చుఁ [1]దొంటిరంతు పొంటెఁదలఁప
శమితకుజనతర్క జయరమాసంపర్క
విమతకైరవార్క విక్రమార్క.

74


క.

జలములు పైఁబడక మహా
నల మాఱదు శౌర్యభూషణా నీకోపా
నలము రిపుసతులకన్నుల
జలములు గని యాఱు నెంత సత్త్వం బిచటన్.

75


క.

కావున యశముఁ బ్రతాపము
నేవెరవునఁ బొగడఁ జెల్లు నెవ్వరి సరిగాఁ
గావింపవచ్చు దీనులఁ
గావం బ్రోవంగ నీవె కారణ మగుటన్.

76


ఉ.

దేవసమాన నిన్ను వినుతించుట వాంఛితసిద్ధి భూమిలో
నేవసుధేశు నీయెదుట నెన్నఁగవచ్చు మదీయజిహ్వ ల
జ్జావశయై చలింప దిఁక సద్గుణుముందఱ సద్గుణాఢ్యుఁ బ్ర
సావన చేయనేరనియతం డతిమూఢుఁడు గానఁ జెప్పెదన్.

77


ఆ.

విపులదుర్గ మైన వింధ్యపర్వతసీమఁ
జంద్రకాంతసౌధజాలరుచుల
రాజపురముతోడ రాయుచు మించిన
రత్నపురము నాఁ బురంబు గలదు.

78


క.

ఒకటొకటికంటెఁ బొడవనఁ
బ్రకటముగా నచటి హర్మ్యపంక్తులు దివి ము
ట్టి కలశభవుచే వింధ్యా
ద్రికిఁ గృతముననైన కొఱఁతఁ దీర్చుచునుండున్.

79
  1. తొంటిపొందెతలప