పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/500

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఏకాదశాశ్వాసము

439


దెసననున్న మీకు రెంటి నిచ్చి కడమ నాకొసంగిన దండయందుఁ దుమ్మెద సుఖియింప నిమ్మని తొడమీఁద నిడుకొనినభావంబు మీ రెఱుంగరైతిరి.

55


క.

ఆరసికుఁ డెఱిఁగి వచ్చిన
నీరీతుల నడుమఁ గలిసి యెఱుకపడఁగ మా
[1]చీరలు వీడ్వఱిచితిమి వి
చారింపఁగ నేల సాధు జయ మౌఁ గాదో.

56


క.

నావుడు వనితల నెవ్వఁడు
గావంగా నోపు మాప్రకార మొరులకు
న్నీ వెఱిఁగింపకు మని ల
జ్జావనతముఖాబ్జు లగుచు నరిగిరి చెలియా.

57


ఉ.

నిన్నటిరాత్రి యీతగులు నీగతి నిచ్చట విశ్రమించుచుం
బొన్నలు గోయవచ్చితి నపూర్వపుఁబంతము వింటివే యనం
బ్రన్నన నవ్వి యీకొలఁది పంతము లెవ్వరుఁ జేయ రుర్విలో
ని న్నికఁ గాముకు ల్గెలువనేర్తురె యండు నుతించె బోటియున్.

58


ఆ.

ఇట్టిగోష్ఠి వినుచు నేను గూఢంబుగాఁ
దరుపుమీఁదఁ బెద్దతడవు నిలిచి
విరులు గోసికొంచు నరిగెడునంతలో
విభునిదేవపూజవేళ దప్పె.

59


చ.

అలుకుచు నేగ నాతఁడు శివార్చనవంచక మాల్యవత్తటి
న్నిలిచి దినంబు మానవులనెత్తురు ద్రావెడి శోణితప్రియం
గొలిచి మనుష్యహంత వయి కోవెలలోపల నుండుమంచు న
న్నలిగి శపించె నీశ్వరనిరాకరణం బిది రిత్తవోవునే.

60
  1. చీరలు వీడ్వడఁగట్టిన, సారస్యం బిదియ నాదుజయ