పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/499

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

438

సింహాసన ద్వాత్రింశిక


వ.

తరువాత వానికిఁ బసిండిటంకం బిప్పించి సంచిలోఁ బడినయప్పుడు గాని యిది దక్కదని పలికి యీతుమ్మెద ప్రియము చెడకుండు మాగవని యొద్ది సురపొన్నమీఁద విడిచిపొమ్మని వీడుకొలిపిన వాఁడును నట్లు చేయుచుం జని మత్సమాగమంబునకుఁ బెక్కువిచారంబులు సేయుచు నెఱజాణయగుటం జేసి.

48


ఉ.

నిష్కము సంచిలోఁ బడుట నీరజమిత్రుఁడు గ్రుంకువేళఁ గాఁ
బుష్కరనేత్ర చెప్పె నళి పొన్నపయి న్విడుమంట లోనికిన్
దుష్కరవృత్తిగా దదియు త్రోవ చుమీ యని చూపు టయ్యె నే
శుష్కవిచారము ల్వలదు సూర్యుఁడు గ్రుంకిన నంద యేగెదన్.

49


క.

అని నిశ్చయించుకొనునెడ
వనజాప్తుఁడు నిప్పుమాడ్కి వారిధిలోన
న్మునుఁగఁగ నెగసిన పొగ క్రియ
ఘనముగఁ దిమిరంబు దిశలఁగనుకని పర్వెన్.

50


ఆ.

అంతఁ బ్రొద్దు వుచ్చి యంధకారంబులోఁ
బొన్న యెక్కి వచ్చి పొంచిపొంచి
జగతిమీఁద నొక్కశయ్యపైఁ బురుషుల
నడుమ నిద్రవోవు నన్ను లేపె.

51


52-54 గ్రంథపాతం

వ.

పిదప నయ్యిద్దఱం గదలించి యిప్పుడు నాతోడఁ గ్రీడసల్పినవాఁ డెవ్వండు చెప్పుఁడా యనిన వాండ్రు నొండొరులఁ జెప్పుకొని తారు గాకుండుట దెలిసికొని [1]కళవళపడి యిది యేమి చోద్య మని విచారించుచు నుండంగ, నేను, బగలు వచ్చిన మాలకరి యప్పుడు దెచ్చిన మూఁడెత్తులలో నీరు

  1. తక్కలపడి