పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/498

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

437

ఏకాదశాశ్వాసము


రీయుతముగ నుపచారము
సేయించితిఁ [1]దెక్కరముగఁ జిత్తము లలరన్.

40


వ.

తదనంతరంబ వారలు కుసుమంబులుం దాంబూలంబులుఁ బుచ్చుకొని యో విటవంచనీ నీ పేరు నిజంబుగ నెటువంటి విటుల నైన మోసపుత్తు వఁట నిక్కువంబే యని యడిగిన.

41


క.

కల్లలు నిజములు ధర్మము
మొల్లంబును బ్రియము మోహమును నలుకయు న
య్యుల్లసము నయము సరిగాఁ
జెల్లును వెలయాండ్రయందు క్షితిపతులందున్.

42


43-46 గ్రంథపాతం


సీ.

మఱియు నొక్కండు బ్రాహ్మణవిటుం డనువరి
        ననుఁగోరి చనుదెంచి నాకునైన
తగులెల్ల విని నన్ను దర్శింప మఱి యుపా
        యము లేక సుధ పొన్న లమరఁగట్టి
మూఁ డెత్తులుగఁ జేసి మును మాలకరి వోలె
        నేతెంచి నాచేతి కిచ్చినంత
నిరుదెసలం దున్న యిద్దఱ కొసఁగి యం
        దొక్కటి నేఁ గొన నుత్సహించి


ఆ.

యందుఁ దేనె గ్రోలు నళిఁ జూచి యిదియును
క్షణము సౌఖ్య మొందుఁగాక యంచు
ముడిచికొనక దండ దొడమీఁద నిడుకొంటిఁ
గ్రొత్తవాని కియ్యకోలు గాఁగ.

47
  1. తేకరముగ