పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/497

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

436

సింహాసన ద్వాత్రింశిక


క.

నావుడు వెఱఁ గందుచు నీ
కేవిధమున శాప[1] మొదవె నీకథ తెలియం
గా వినిపింపుము మాకని
భూవల్లభుఁ డడుగ దివ్యపురుషుఁడు వల్కెన్.

35


ఆ.

ధనదు దేవపూజ కనువగు క్రొవ్విరు
లెచట నైనఁ గోసి యేన తెత్తుఁ
[2]దెల్లవాఱ విరులు దేనొకనాఁ డేగి
మధువనమున నొక్కమగువఁ గంటి.

36


క.

అన్నెలఁతుక యెదురను సుర
పొన్నలు గోయంగ వచ్చి పుష్పాయుధుచే
నున్న నెఱవాదియమ్ములఁ
గన్నుల నగుచున్న చెలియకడకుం జనియెన్.

37


క.

అట చని మదిసమ్మద ము
త్కటముగ సఖిఁ గౌఁగిలించి కానగరా వో
విటవంచని [3]యిన్నిదినము
లెట పోయితివనిన నదియు నిట్లని పలికెన్.

38


క.

రతిలంపటుఁడును శృంగా
రతిలకుఁడు ననఁగ విటులు రసికత్వమునన్
క్షితిఁ దిరుగుచు [4]నావెర వ
ద్భుతముగ విని నన్నుఁ గెలువఁబూనికడంకన్.

39


క.

నాయింటికి నరుదెంచిన
నాయిద్దఱ కేను జందనాగురుకస్తూ

  1. శాపమబ్బె శాపమయ్యె
  2. కానకరిగి విరులు దేనొకనాఁడిచ్చ
  3. యిన్నాళ్ళీ
  4. నా పేరద్భుత