పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/496

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఏకాదశాశ్వాసము

435


గంధపుష్పాక్షతాదు లిచ్చి దేవిచేరువ గమ్మని యతని ముందట నిడి తలంగిన.

29


ఆ.

మెచ్చుగాఁగ నిట్టి మెకము [1]సాళించెద
ననుచుఁ జండిమంత్ర మొనరఁజెప్పి
పూజకుం డొకండు భూమీశుతల ద్రుంప
బెడిదమైన వాఁడియడిద మెత్తె.

30


క.

ఆతని ప్రభావమునఁ బరా
హతయై తద్గుణము మెచ్చి యయ్యెడ నాదే
వత యడిదము గొని మతినా
తతమగు రోషమున వానితల దెగ నడిచెన్.

31


శా.

ఆపాపాత్ముని నట్లు ద్రుంచి నవరక్తాస్వాదనప్రీతయై
భూపాలోత్తముధర్మముం దయయుఁ దెంపు న్మెచ్చుచుం బ్రేతభూ
తోపేతంబుగ డాకినీసముదయం బుప్పొంగుచు న్నర్తన
వ్యాపారంబులఁ దోడుసూపఁ జెలఁగెన్ వ్యక్తస్వరూపంబునన్.

32


ఉ.

అంతఁ బ్రసన్నయై నిలిచి యార్తశరణ్యుని నిన్ను మెచ్చితిం
జింతిత మైన కార్య [2]మిదె చేకుఱ నిచ్చెద వేఁడు మన్న భూ
కాంతుఁడు మ్రొక్కి నీదుకృప గల్గిన నేమి కొఱంత నేఁడు నా
కింతియ చాలు మర్త్యబలి యెన్నఁడుఁ గోరక పూజ నొందుమా.

33


మ.

అని ప్రార్థింపఁగఁ బూజకుండు నట దివ్యాకారుఁడై యంబరం
బున భాసిల్లుచు నిల్చి ఖేచరుఁడఁ [3]గర్పూరాంగుఁడ న్నేఁ గుబే
రుని శాపంబున స్రుక్కి యీగతి నతిక్రూరుండనై యిప్పు డో
జననాథా భవదాగమంబు కలిమి న్శాపావధిం బొందితిన్.

34
  1. సాధించెద
  2. మిటు
  3. గర్పూరాఖ్యుఁడన్