పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/493

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

432

సింహాసన ద్వాత్రింశిక


చ.

దయ యొకయింత లే దచట ధర్మము పేర్కొనరాదు ప్రాణసం
శయము విదేశి కయ్యెడ రసాలవనాంతమునందు శోణిత
ప్రియ యను నొక్కదేవత యభీష్టవిధాయిని భీషణోన్నతా
లయమున నుండుఁ గొండరికులంబున కెప్పుడు నింటివేలుపై.

15


ఉ.

ఏము విదూరయానమున నెంతయుఁ జిక్కి యనంతరంబ వి
గ్రామపదంబు గోరుచు రసాలసుశీతలమైన దేవతా
ధామము చొచ్చి చండికకు దండనమస్కృతు లాచరించి యా
సీమనె యుంటి మొక్కవలచేరినపక్షులభంగి నజ్ఞతన్.

16


క.

ఆయెడ నగరము దెస న
న్యాయతఁ బోనీక పట్టుఁ డరికట్టుఁడు వే
డాయుచు మెడగట్టుం డని
కూయిడఁ బెను ఱంతు పుట్టె గుండియలదరన్.

17


చ.

చందనకుంకుమార్ద్రఘనసారనవాక్షతపాత్రహస్తయై
సుందరి యోర్తు భూషణరుచు ల్మెఱయ న్వనలక్ష్మి పోలిక
న్ముందఱ నేగుదెంచి గుడిమోసలఁ దూఱుచు మమ్ముఁ గాంచి చూ
డ్కిందయ దొంగలింపఁ బలికెం బలుకు ల్మది కింపుపుట్టఁగఁన్.

18


చ.

వెఱవక యున్నవార లిట వెఱ్ఱితనం బిది గాదె కొండరుల్
చుఱు కొకయింత లేక [1]మనుజుం దమదేవత కిందు నిత్యముం
జెఱు పొనరింతు రిప్పు డది [2]సేగి విదేశులఁ బట్టుచున్నవా
రెఱుఁగఁగ జెప్పితి న్వెడలి యేగుఁడు ప్రాణము సడ్డ గల్గినన్.

19


చ.

అనవుడు నేము నాత్మహృదయంబులు మిక్కిలి తల్లడింపఁ జ
య్యన వెలి కేగి వాకిట భయంకర మైనఁ దదీయపశ్చిమం
బునఁ గలుకోట యెక్కి సురపొన్నలు నేపెలు నున్నతోఁటలోఁ
గనుకని బాఱి వచ్చితిమి క్రమ్మఱి చూచుచు బమ్మరించుచున్.

20
  1. మనుచుం
  2. జోగివిదేశులఁ