పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/492

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఏకాదశాశ్వాసము

431


క.

ఆవేళఁ బేదచెంచుల
కావాసం బైన పల్లెప్రాంతంబున ఛా
యావితతము లగు సురిగల
క్రేవఁ బరిశ్రమము దీర్ప క్షితిపతి నిలిచెన్.

9


చ.

ఆట పరదేశికు ల్నలువు రధ్వపరిశ్రమఖేదఖిన్నులై
నిటలములందుఁ జెంజెమట [1]నిల్వక చెక్కులు జాఱ నెండచేఁ
గటముల రక్తకాంతి నధికంబుగ జొత్తిల దప్పి నోష్ఠసం
పుటములు వాడఁగా వగరుపుట్టఁగ వచ్చిరి వెచ్చనూర్చుచున్.

10


క.

వారం గైకొని శీతల
వారిం దృష దీర్చి గారవముతోడ ఫలా
హారంబు లొసఁగి క్షుత్పరి
హారం బొనరించి యలఁత యంతయుఁ దీర్చెన్.

11


క.

సమనంతరంబ మీ కీ
క్రమమున బెట్టలయనేల ఘర్మాంతపరి
భ్రమణమున నింత పుట్టునొ
విమతులు వధియింపఁగడఁగి వెనుదగిరొకో.

12


క.

నావుడు నొక్కరుఁ డాతని
భావజ్ఞుం డనుచు మిగులఁ బ్రణుతించి నిజం
బీవ యెఱింగితి వట్లౌ
నావిధ మేర్పడఁగ విను భయంకర మరయన్.

13


క.

ఈతల మూఁడామడలం
దాతతముగ మాల్యవంత మనుగిరి మెఱయున్
వేతాళనగర మనఁగఁ గి
రాతేశ్వరుఁ డేలునొకపురం బున్న దటన్.

14
  1. నీళులు మేనుల జాఱ